ఆ కామెంట్లు హర్ట్ చేయడం వల్లే షారుఖ్ మూవీ ప్రశాంత్ టార్గెట్ చేశాడా.. ఏమైందంటే?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashant Neel )రాజమౌళిలా సినిమా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరనే సంగతి తెలిసిందే.

సలార్ సినిమా వాయిదా పడుతుందని కామెంట్లు వచ్చిన సమయంలో కొంతమంది జవాన్ సినిమా( Jawan Movie )కు పోటీగా విడుదల చేయడానికి భయపడి ప్రశాంత్ నీల్ తన సినిమాను వాయిదా వేశారని కామెంట్లు చేశారు.

వాస్తవానికి జవాన్ సినిమా రిలీజ్ కు సలార్ సినిమా రిలీజ్ కు మధ్య మూడు వారాల గ్యాప్ ఉంది.

"""/" / అయినప్పటికీ కొంతమంది ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.

అయితే ఈ కామెంట్లు కోపం తెప్పించడంతో ప్రశాంత్ నీల్ తన సినిమాను షారుఖ్ ఖాన్ సినిమా డుంకీకి( Dunki ) పోటీగా విడుదల చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

డుంకీ వర్సెస్ సలార్ పోటీ వెనుక అసలు కథ ఇదేనని సమాచారం.గతంలో కూడా షారుఖ్ ఖాన్ జీరో సినిమాకు పోటీగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మూవీ విడుదలైంది.

"""/" / ఆ సమయంలో కూడా కేజీఎఫ్ సినిమా పైచేయి సాధించింది.ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తానని ప్రశాంత్ నీల్ ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.

సలార్ సినిమా( Salaar )కు పోటీగా ఏ సినిమా విడుదలైనా ఇబ్బందులు తప్పవని మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ కానుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ సలార్ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో లాభాలను అందుకుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

సలార్ సినిమా మాస్ ప్రేక్షకులకు, యాక్షన్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సలార్ సినిమాకు సీక్వెల్ గా సలార్2 మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.