జన సైనికులకు పవన్ క్లాస్ .. కారణాలు ఏమిటంటే?
TeluguStop.com
చాలాకాలం తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) జనసైనికులకు బహిరంగ లేఖ రాశారు.
ఈ లేఖ సారాంశం మొత్తం గమనిస్తే జన సైనికులకు క్రమశిక్షణ పరంగా కొన్ని హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తుంది .
జరుగుతున్న పరిణామాలు పట్ల జనసైనికుల ను అప్రమత్తం చేయడానికి , రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకునే .
అవగాహన వారిలో పెంచడానిక కే ఈ ఉత్తరం రాసినట్టుగా తెలుస్తుంది
ఆయన లేఖ లోని ముఖ్యంశాలను గమనిస్తే జనసైనికులను తప్పుదోవ పట్టించేలా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని, జన సైనికులు వీర మహిళల ఆత్మ అభిమానం దెబ్బతీసేలా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని అందువల్ల తమకు తమకు అందిన సమాచారం పై పూర్తిస్థాయి నిజా నిజాలు తెలుసుకున్న తర్వాతే మీడియా లో గాని సోషల్ మీడియా లో గాని మాట్లాడాలని.
ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాలు విషయంలో మాట్లాడేటప్పుడు పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకున్న తర్వాతే మాట్లాడాలని లేకపోతే మన మాటకు ఉన్న బలం తగ్గిపోతుందని తనపై వచ్చిన విమర్శలకు తాను ఆచుతూచి మాట్లాడుతానన్న విషయాన్ని జనసైనికులు గుర్తుంచుకోవాలని పవన్ ఈ లేఖలో( Pawan Letter ) కోరారు """/" /
ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ఎట్టి పరిస్థితుల లోనూ వారి కుటుంబ సభ్యులను విమర్శించకూడదని ,విమర్శలు కూడా అంశాల వారీగా ఉండాలే తప్ప సభ్యసమాజం మనని తప్పు పట్టేటట్టుగా ఉండకూడదు అంటూ సూచనలు చేశారు.
మీడియాలో వచ్చిందనో ఎవరో ఏదో అన్నారనో మన విమర్శలు చేయకూడదని మనం మాట్లాడే ప్రతి మాటకు విశ్వసనీయత ఉండాలని మీరు ఇబ్బంది పడి పార్టీని ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఆయన సూటిగా స్పష్టం చేశారు """/" /
పొత్తులపై పార్టీకి ఏది మంచితో తాను నిర్ణయించుకునే చేస్తానని, అందువల్ల ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు వెళ్లాలని తీవ్రమైన విషయాలపై స్పందించేటప్పుడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని సంప్రదించి ముందుకు వెళ్లాలంటూ ఆయన జనసైనికులకు సూచనలు చేశారుఎన్నికలు దగ్గరలో ఉన్నందున జనసైనికులను రెచ్చగొట్టి పార్టీ పరువు తీసే విధంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయన్న స్పష్టమైన సమాచారం ఉన్నందునే ఆయన ఇలా జనసైనికులను అప్రమత్తం చేసే విధంగా లేఖ రాశారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
How Modern Technology Shapes The IGaming Experience