ఆ సమయంలో తారకరత్నను దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ.. ఏమైందంటే?

శనివారం రోజు రాత్రి నందమూరి తారకరత్న మరణించారనే వార్త అభిమానులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.

జనవరి నెల 26వ తేదీన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఆ సమయంలో గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అందించగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించడం జరిగింది.

అక్కడ చికిత్స పొందుతూ తారకరత్న తుదిశ్వాస విడిచారు.తారకరత్న మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

తారకరత్న తొలి మూవీ ప్రారంభం రోజే ఇతర తొమ్మిది సినిమాల పూజా కార్యక్రమాలు సైతం జరిగాయి.

ఒకేరోజు తొమ్మిది సినిమాలకు కొబ్బరికాయ కొట్టడం తారకరత్న విషయంలో మాత్రమే జరిగింది.ఈ విధంగా తొమ్మిది సినిమాలకు ఒకేరోజు కొబ్బరికాయ కొట్టడం బాలయ్య ప్లానింగ్ కావడం గమనార్హం.

"""/" / 1983 సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తేదీన తారకరత్న జన్మించారు.

చిన్నప్పటి నుంచి తారకరత్నకు సినిమాలపై ఆసక్తి ఉండేది.ఒకేరోజు 9 సినిమాలకు కొబ్బరికాయ కొట్టినా ఆ సినిమాలలో ఒకటో నంబర్ కుర్రాడు మాత్రమే విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

అమరావతి, రాజా చెయ్యి వేస్తే సినిమాలలో తారకరత్న విలన్ గా నటించడం గమనార్హం.

నందమూరి తారకరత్నది లవ్ మ్యారేజ్ కాగా 2012లో అలేఖ్యా రెడ్డితో తారకరత్న వివాహం జరిగింది.

"""/" / హైదరాబాద్ లోని సంఘీ టెంపుల్ లో సింపుల్ గా మ్యారేజ్ జరిగింది.

అయితే తారకరత్న అలేఖ్యారెడ్డి వివాహం నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేదు.విజయసాయిరెడ్డి మరదలి కూతురైన అలేఖ్యా రెడ్డికి అప్పటికే పెళ్లై మొదటి భర్తకు విడాకులు ఇవ్వడం నందమూరి ఫ్యామిలీకి కోపం తెప్పించింది.

ఆ తర్వాత రోజుల్లో నందమూరి ఫ్యామిలీ తారకరత్న మధ్య సమస్యలు పరిష్కారమయ్యాయి.

ఉల్లి తొక్కలను పారేస్తున్నారా.. జుట్టుకు ఇలా వాడితే బోలెడు లాభాలు!