బాలయ్య వ్యాఖ్యల గురించి నాగ్ స్పందించకపోవడం వెనుక అసలు కథ ఇదే!
TeluguStop.com
స్టార్ హీరో బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
బాలయ్య ఈ విధంగా కామెంట్లు చేసి తప్పు చేశాడని చేసిన తప్పును బాలయ్య సరిదిద్దుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
అయితే బాలయ్య వ్యాఖ్యల గురించి చైతన్య, అఖిల్ స్పందించినా నాగార్జున మాత్రం స్పందించలేదు.
అయితే బాలయ్య వ్యాఖ్యల గురించి నాగ్ స్పందించకపోవడం వెనుక అసలు కారణం వేరే ఉంది.
ఈ వ్యాఖ్యల గురించి నాగ్ స్పందిస్తే ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
కారణాలు తెలియవు కావు కానీ బాలయ్య నాగ్ మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయి.
ఈ వివాదం గురించి నాగ్ స్పందిస్తే రాబోయే రోజుల్లో కూడా రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండవు.
"""/"/
మరోవైపు ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైన నేపథ్యంలో క్షమాపణలు చెబితే వైసీపీ నేతల నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయని బాలయ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ రీజన్ వల్లే క్షమాపణల విషయంలో బాలయ్య వెనక్కు తగ్గుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నాగార్జున ఇప్పుడు స్పందించకపోయినా భవిష్యత్తులో ఈ వివాదం గురించి స్పందించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి.
"""/"/
బాలయ్య దిద్దుబాటు చర్యల దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య క్షమాపణలు చెప్పని పక్షంలో లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామని బెదిరింపులు వస్తున్నాయి.
బాలయ్య వీలైనంత త్వరగా ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు.బాలయ్య ప్రస్తుతం తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ప్రత్యక్షంగా స్పందించకపోయినా సోషల్ మీడియా వేదికగా బాలయ్య క్లారిటీ ఇస్తే ఈ వివాదం ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.
సీనియర్ ఎన్టీఆర్ కొడుకు, ఎమ్మెల్యే అయిన బాలయ్య వివాదాల్లో చిక్కుకోవడం ఆయన అభిమానులకు కూడా నచ్చడం లేదు.