మోహన్ బాబు మొదటి భార్య మరణించడం వెనక ఉన్న కారణాలు ఏంటి..?
TeluguStop.com
మనలో చాలా మంది అన్ని కష్టాలు మనకే వస్తాయి వెండి తెరపై కనిపించే హీరోలకి ఏ కష్టాలు ఉండవు, వాళ్ళ జీవితాలు ఆడి కార్లలో తిరుగుతూ హ్యాపీగా, హాయిగా సాగిపోతాయి అనుకుంటారు.
కానీ వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి.అని మనలో చాలామందికి తెలియదు.
ఇప్పుడు మనం తెలుసుకునే స్టోరి అలాంటిదే.భక్తవత్సల నాయుడు అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.
కానీ తానో టాలీవుడ్ దిగ్గజ నటుడు.ఎన్టీఆర్, ఏన్నార్, ఎస్వీఆర్ ల తరువాత ఏ పాత్ర అయినా అలవోకగా చేసే సామర్థ్యం ఉన్న నటుడు.
ఆ నటనని పసిగట్టిన దాసరి నారాయణ రావు గారే అతనికి మోహన్ బాబు అని నామకరణం చేసి తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసారు.
ఇదంతా ఎందుకు చెపుతున్ననంటే అలాంటి నటుడు జీవితం లో కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు , పడరాని కష్టాలు పడ్డాడు అని మీకు తెలుసా తెలియదు కదా అందుకే చూద్దాం రండి.
"""/"/
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏం చేయాలో తెలియక ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మోహన్ బాబు గారికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకొమ్మని చెప్పడంతో పెళ్ళికి రెడీ అయిపోయాడు.
పెళ్లిచూపులు అయిపోయాయి.మోహన్ బాబు గారికి విద్యా దేవి గారికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.
కానీ మోహన్ బాబు గారు B.A చేసారు, విద్యా దేవి గారు M.
A చేసారు.రెండు కుటుంబాలకి వీళ్ళ చదువు ఒక్కటే అడ్డంకి అవుతుందేమో అని మోహన్ బాబు గారు భయపడ్డారు.
కానీ విద్యావతి గారి చొరవతో దాన్ని అధిగమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.కొన్నాళ్ళు వీళ్ళ కాపురం సాఫీగా సాగిపోయింది వీళ్ళ ప్రేమకి గుర్తుగా లక్ష్మి ప్రసన్న, విష్ణు ఇద్దరు పిల్లలు జన్మించారు.
"""/"/
అందరు వీళ్ళకేంటి హ్యాపీ ఫ్యామిలీ అనుకున్నారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మోహన్ బాబు గారికి విద్యావతి గారికి మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి.
షూటింగ్స్ నుంచి ఇంటికి రాగానే ఇలా గొడవలు జరుగుతుండడం మోహన్ బాబు గారికి నచ్చక పోయేది ఏం జరిగిందో తెలీదు కానీ ఒకరోజు విద్యా దేవి గారు సూసైడ్ చేసుకొని చనిపోయారు.
ఆవిడా చనిపోయాక ఎందుకు చనిపోయారు అని ఆరా తీస్తే విద్యా దేవి గారి చెల్లెలు నిర్మలకి, మోహన్ బాబు గారికి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకోని ఆలా సూసైడ్ చేసుకుందని న్యూస్ బయిటికి వచ్చింది.
ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ తన బిడ్డలు అయిన లక్ష్మి ప్రసన్నని, విష్ణు ని మాత్రం విడిచి పెట్టి విద్యా దేవి గారు అనంత లోకాలకి వెళ్లిపోయారు.
తర్వాత కొన్నాళ్ళకి తల్లి లేని పిల్లల్ని చూడలేని మోహన్ బాబు గారు విద్యా దేవి చెల్లెలు నిర్మల గారిని పెళ్లి చేసుకున్నారు.
"""/"/
మోహన్ బాబు గారు విద్యా దేవి గారి ప్రేమకి గుర్తుగానే విద్యానికేతన్ అనే స్కూల్స్ ని స్థాపించారు.
విద్యావతి గారి పిల్లలు అయిన విష్ణు విష్ణు మూవీ తో హీరో పరిచయం అవ్వగా ఢీ మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
విష్ణు రీసెంట్ గా మోసగాళ్లు అనే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న మూవీ కూడా చేస్తున్నాడు.
విష్ణు 2008 లో విరోనికా ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి ఆరియానా వివియానా అని ఇద్దరు కవల పిల్లలు జన్మించారు తర్వాత అబ్బాయి ఆవ్రవిక్త జన్మించారు తర్వాత ఐరవిద్య మంచు జన్మించారు.
కూతురు లక్ష్మి ప్రసన్న కూడా అననగా ఓ ధీరుడు మూవీ లో విలన్ గా నటించి తండ్రి తగ్గ కూతురుగా మంచు గుర్తింపు తెచ్చుకుంది.
గుండెల్లో గోదారి మూవీ లో సందీప్ కిషన్ పక్కన హీరోయిన్ గా చేసి సక్సెస్ అయింది.
కానీ ఇదంతా చూడడానికి విద్యావతి లేరు.అలాగే మోహన్ బాబు నిర్మల కి పుట్టిన బాబు మనోజ్ కూడా దొంగ దొంగాది మూవీ తో హీరో గా పరిచయం అయి బిందాస్ మూవీ తో హీరో గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
మనోజ్ 2015 లో ప్రణితి రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వాళ్ళ లైఫ్ లో కూడా ఏమో ఇబ్బందులు ఎదురై మొత్తానికి విడిపోదాం అని అనుకుని 2019 లో డైవర్స్ తీసుకున్నారు.
హీరోల జీవితాల్లో కూడ కష్టాలు ఉంటాయి అని చెప్పడానికి మోహన్ బాబు గారి జీవితమే ఒక ఉదాహరణ.
పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!