Junior NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్లు తక్కువగా ఉండటానికి కారణాలివేనా?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సినీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్లు ఏవనే ప్రశ్నకు సింహాద్రి, ఆర్.
ఆర్.ఆర్ సినిమాల పేర్లు సమాధానంగా వినిపిస్తుంది.
అయితే ఈ రెండు సినిమాలు కాకుండా తారక్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్లు తక్కువగా ఉన్నాయి.
ఇందుకు కారణమేంటనే ప్రశ్నకు కెరీర్ తొలినాళ్లలో తారక్ చేసిన తప్పులే కారణమని జవాబుగా వినిపిస్తుంది.
ఆది, సింహాద్రి సినిమాల తర్వాత తారక్ ఎక్కువగా మాస్ సినిమాలకే పరిమితమయ్యారు.అందువల్ల తారక్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పును పొందలేదు.
తర్వాత రోజుల్లో తారక్ మారినా కెరీర్ పరంగా చేసిన కొన్ని తప్పులు ఆయనకు మైనస్ అయ్యాయి.
మరోవైపు ఫ్లాప్ డైరెక్టర్లకు( Flop Directors ) తారక్ ఎక్కువగా ఛాన్స్ ఇవ్వడం వల్ల కూడా ఆ డైరెక్టర్లు సేఫ్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంతో మరీ భారీ విజయాలు అయితే దక్కలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
"""/"/
ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తారక్ ఇప్పుడు నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్( Pan India Movies ) లు కావడంతో ఈ సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతుండటంతో ఇకపై తారక్ వరుస విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. """/"/
బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం గురించి స్పష్టత రావాల్సి ఉంది.
తారక్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood )లో సైతం భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
వరుసగా 6 విజయాలు తారక్ కెరీర్ కు ఊహించని స్థాయిలో ప్లస్ అయ్యాయి.
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సూసేకి పాటకు వధువు క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్..