ఇంద్రజ స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి అసలు కారణమిదేనా..?
TeluguStop.com
జబర్దస్త్ షోకు కొన్ని వారాల పాటే జడ్జిగా ఉన్న ఇంద్రజ బుల్లితెరపై ఊహించని స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు.
తెలుగమ్మాయి అయిన ఇంద్రజ ఇతర భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నా తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయారు.
కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించిన ఇంద్రజ మంచి గాయని కూడా కావడం గమనార్హం.
80కు పైగా సినిమాలు చేసిన ఇంద్రజ తెలుగులో సీనియర్ హీరోలకు జోడీగా నటించారు.
కృష్ణ, బాలకృష్ణ, మోహన్ బాబు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఇంద్రజ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యమలీల సినిమాతో ఇంద్రజకు తెలుగులో నటిగా కెరీర్ మొదలైంది.
నాగార్జున హీరోగా తెరకెక్కిన హలో బ్రదర్ మూవీలో ఇంద్రజ స్పెషల్ సాంగ్ చేశారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో దిక్కులు చూడకు రామయ్య, లయన్, శమంతక మణి సినిమాలలో ఇంద్రజ నటించారు.
"""/"/
పలు సీరియళ్లలో ఇంద్రజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో సైతం నటించడం గమనార్హం.
సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు తగ్గిన పెళ్లి చేసుకున్న ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రల్లో ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.
అయితే ఇంద్రజ తెలుగులో స్టార్ హీరోయిన్ కాకపోవడానికి విధి కారణమని తెలుస్తోంది.హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు వచ్చి ఉంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యేవారు.
"""/"/
తెలుగులో చిరంజీవి మినహా అప్పటి అగ్ర హీరోలకు జోడీగా ఇంద్రజ నటించడం గమనార్హం.
ఇంద్రజ పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు.ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.
ఇంద్రజకు జబర్దస్త్ షో ద్వారా అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది.
వీడియో: తండ్రితో కలిసి తాజ్ మహల్ చూడడానికి వచ్చిన ఫారినర్‌కు చేదు అనుభవం..?