Heroine Gajala: హీరోయిన్ గజాలా ఆ హీరో కోసం సూసైడ్ చేసుకోబోయిందా.. అంతలా ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గజాలా( Heroine Gajala ) బాగా సందడి చేసింది.

పక్కింటి అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం ఏర్పరచుకుంది.కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.

ఎంత త్వరగా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందో అంతే తొందరగా ఇండస్ట్రీకి గుడ్ బై కూడా చెప్పేసింది.

ఇక ఈమె తొలిసారిగా 2001లో జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ( Naalo Unna Prema ) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత ఓ చిన్నదాన, విజయం, అల్లరి రాముడు ఇలా పలు సినిమాలలో నటించగా.

తనకు స్టూడెంట్ నెంబర్ వన్, కలుసుకోవాలి అనే రెండు సినిమాలు మంచి గుర్తింపును అందించాయి.

"""/" / ఆ తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్( Janaki Weds Sriram ) సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

అలా ఒక మంచి ఫామ్ లో ఉన్న సమయంలో తను సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

ఆ సమయంలో తను ఎందుకు దూరమైందో అన్న ప్రశ్నలు చాలామందిలో ఎదురయ్యాయి.అయితే ఈమె గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్న విషయం బాగా సంచలనం రేపింది.

కొన్ని సంవత్సరాల కిందట తను హైదరాబాదులో ఒక అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని.

దీంతో తోటి నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి ఆమెను ఆసుపత్రికి తరలించటంతో బతికి బయటపడిందని తెలిసింది.

అయితే తనను ఒక హీరో మోసం చేశాడన్న విషయంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని కొన్ని వార్తలు అయితే వచ్చాయి.

"""/" / అంటే ఆ హీరోని ఇష్టపడటంతో అతని పెళ్లి చేసుకుందాం అనుకునే సమయంలో అతడు హ్యాండ్ ఇవ్వటం వల్ల తను అలా చేసింది అని అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి.

కానీ అసలు విషయం అది కాదని తను ఆత్మహత్య చేసుకోవడానికి మరో కారణం ఉంది అని ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అని తెలిసింది.

అయితే అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె వరుసగా సినిమాలు తీసి మంచి క్రేజ్ అందుకోవటంతో.

ఆ తర్వాత నటించిన ఎన్టీఆర్ సినిమాలో ఆమెకు డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వలేదని.దీంతో ఎన్టీఆర్ పై ప్రేమను పెంచుకున్న గజాల ఆయన సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వకపోతే తనకు హిట్స్ పడవని లేకపోతే సూసైడ్ చేసుకుంటాను అని బలవంతంగా బాత్రూంలోకి వెళ్లి ఫినాయిల్ తాగిందని.

"""/" / ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్లు ఆమెను రక్షించి హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని.

దాంతో ఆమె ప్రాణాలతో బయటపడిందన్న వార్తలు వచ్చాయి.నిజానికి ఈ వచ్చిన ఈ రెండు వార్తల్లో ఏది నిజమో తెలియదు కానీ.

ఆమె మాత్రం అప్పట్లో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అన్నది మాత్రం నిజమే.ఇక అలా కొంతకాలం తర్వాత హిందీ నటుడైన ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకోగా ప్రస్తుతం తన పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసింది.

జానీ మాస్టర్ కు కౌంటర్ ఇచ్చిన శ్రేష్ట వర్మ.. ఆ కామెంట్లపై క్లారిటీ వచ్చేసిందిగా!