బ్రహ్మానందం సినిమాలు తగ్గించడానికి అసలు కారణమిదా.. ఆయన ఏం చెప్పారంటే?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం (brahmanandam)ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదు.
బ్రహ్మానందం ఒకప్పుడు 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారనే సంగతి తెలిసిందే.
అయితే తన కొడుకుతో కలిసి బ్రహ్మానందం "బ్రహ్మా ఆనందం" (Brahma Anandam)అనే సినిమాలొ నటించగా వాలెంటైన్స్ డే(Valentine's Day)Valentine's Day సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka)ఈ సినిమాను నిర్మిస్తుండగా ఆర్.వి.
ఎస్.నిఖిల్( RVS Nikhil) ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమా డైరెక్టర్ నేను అంగీకరిస్తే మాత్రమే సినిమా తీస్తానని అన్నారని చెప్పుకొచ్చారు.
నేను నా కొడుకు తాతా మనవళ్లుగా కనిపిస్తామని బ్రహ్మానందం వెల్లడించారు. """/" /
నాకు టెన్షన్ అనేది ఎప్పుడూ లేదని నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తానని చెప్పుకొచ్చారు.
మన పేరుతో సినిమా వస్తుందంటే కాలర్ ఎగరేసే మూమెంట్ కదా టెన్షన్ ఎందుకని బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు.
బాగానే చేస్తున్నాను కానీ ఇంతకు ముందు వచ్చినంత నవ్వు ఇప్పుడు రావడం లేదని కొంతమంది కమెడియన్స్ అనడం విన్నానని బ్రహ్మానందం అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/" /
వయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.గతంలో ఉన్నంత యాక్టివ్ గా నేను ఉండలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.
మనల్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలని బ్రహ్మానందం వెల్లడించారు.స్వీయ విమర్శ చేసుకుంటూ ముందుకెళ్లాలని అందుకే సినిమాలు తగ్గించానని ఆయన అన్నారు.
బ్రహ్మానందం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కమెడియన్ బ్రహ్మానందం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నా భార్యను ఈ గొడవలోకి లాగారు… ఎవరిని వదిలిపెట్టను: మంచు మనోజ్