Adi Reddy: లక్షల సంపాదన ఉన్నా ఆదిరెడ్డి చెల్లికి పెళ్లి చేయకపోవడానికి కారణాలివే.. ఏమైందంటే?
TeluguStop.com
ఆదిరెడ్డి.( Adi Reddy ) బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకముందు వరకు ఆదిరెడ్డి ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు.
కానీ బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ తో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు ఆదిరెడ్డి.
అంతేకాకుండా బిగ్ బాస్ షో ఆదిరెడ్డి జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు.ఒకప్పుడు ఆదిరెడ్డి బెంగుళూరులో చిన్న జాబ్ చేసుకుంటూ ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడేవాడు.
అతడు బిగ్ బాస్ షో గురించి మాట్లాడే తీరు చూసి ఫ్రెండ్స్ వీడియోలు చేయమని సలహా ఇవ్వడంతో అలా అనుకోకుండా బిగ్ బాస్ రివ్యూవర్ గా మారాడు ఆదిరెడ్డి.
"""/" /
అలా ఫుల్ ఫేమస్ అయ్యాడు.అతని యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యింది.
అలా వచ్చిన ఫేమ్ తో ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 6 లో( Bigg Boss 6 ) పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్ళాడు.
4వ స్థానంలో నిలిచాడు.ఆదిరెడ్డి కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టడం విశేషం.
సెలెబ్రెటీలకు పోటీ ఇస్తూ ఆదిరెడ్డి టాప్ 5 లో చోటు దక్కించుకోవడం గొప్పపరిణామం.
బిగ్ బాస్ షో అనంతరం ఆదిరెడ్డి మరింత పాపులర్ అయ్యాడు.బిగ్ బాస్ రివ్యూవర్ గా( Bigg Boss Reviewer ) ఆదిరెడ్డి సంపాదన నెలకు లక్షల్లోకి చేరింది.
ఒకప్పుడు ఆదిరెడ్డి వాళ్ళ అమ్మ ఒంటిపై కనీస నగలు ఉండేవి కావట.ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తే బంధువుల నగలు పెట్టుకొని వెళ్లేదట.
"""/" /
తల్లి ఆర్థిక బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుందట.ఇప్పుడు మా అమ్మ ఉంటే ఆమె ఒంటి నిండా నగలు చేయిన్చేవాడిని.
ఆ స్థోమత నాకు ఉందని బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.
ఆ మధ్య తనకు నెలకు రూ.39 లక్షల ఆదాయం వస్తున్నట్లు లెక్కలతో సహా చూపించాడు.
కొత్తగా ఒక భారీ ఇల్లు నిర్మిస్తున్నాడు.ఇంత సంపాదిస్తున్న ఆదిరెడ్డి చెల్లికి( Adi Reddy Sister ) మాత్రం పెళ్లి చేయడం లేదు.
అయితే ఆదిరెడ్డి చెల్లెలికి చూపు లేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానల్ లో చాలాసార్లు కనిపించింది.
అయితే తన చెల్లెలికి పెళ్లి చేయకపోవడం పై తాజాగా ఆదిరెడ్డి స్పందించారు. """/" /
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిరెడ్డికి ఈ ప్రశ్న ఎదురవ్వగా.
నా వద్ద డబ్బు ఉంది.కానీ చెల్లికి పెళ్లి చేయను.
నా చెల్లి నాగ లక్ష్మికి( Naga Lakshmi ) కంటి చూపు లేదు.
ఆమెకు ఆపరేషన్ చేయించినా చూపు రాదు.కనుగుడ్లు బాగున్నాయి కానీ, నరాలు సరిగా లేవు.
నాగ లక్ష్మికి ఐదు శాతం మాత్రమే ఒక కంటితో చూడగలదు.అయితే ఒక ఇంట్లో కాసేపు నడిస్తే ఏది ఎక్కడ ఉందో అర్థం చేసుకుంటుంది.
నా చెల్లి బాగోగులు నా భార్యనే చూసుకుంటుంది.అలాంటి నాగ లక్ష్మి వేరే ఇంటికి కోడలిగా వెళితే మరింత కష్టం అవుతుంది.
తనకున్న అంగ వైకల్యంతో అత్తారింటిలో ఆమె నెట్టుకురాలేదు.అందుకే పెళ్లి చేయడం లేదు అని ఓపెన్ గా చెప్పుకొచ్చారు ఆదిరెడ్డి.
కాగా నాగలక్ష్మి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం విశేషం.
పాఠశాలను మూసివేత నుంచి రక్షించిన ఎన్ఆర్ఐ .. నా దేవాలయమంటూ ఎమోషనల్