భీమ్లా నాయక్ లుంగీ ఎందుకు కట్టాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదీ చేసినా సెన్సేషన్‌గా మారడం కామన్ అయిపోయింది.

గబ్బర్ సింగ్ చిత్రంతో పోలీస్ మూవీల్లో కూడా కామెడీ పండించొచ్చని చూపించిన పవన్, ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవల వరుసగా రివీల్ చేస్తుండటంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.

అయితే వారికి మరింత సంతోషాన్ని కలిగించే విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తు్న్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.

ఈ పోస్టర్ కూడా మామూలుగా లేదండోయ్.ఇదివరకు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్‌గా కనిపించిన పవన్ కళ్యాణ్, ఈసారి లుంగీ కట్టుకుని కనిపించాడు.

వెనకాల నుండి లుంగీని పైకి లేపుతూ ఆయన నడుచుకుంటూ వెళ్తున్న పోస్టర్‌తో పవన్ ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ నిండిపోయింది.

అయితే పోలీస్ ఆఫీసర్ అయిన భీమ్లా నాయక్ లుంగీలోకి ఎందుకు మారాడు అనే ప్రశ్న ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది.

ఏదేమైనా తమ అభిమాన హీరో పోలీస్ డ్రెస్ వేసినా, లుంగీలో కనిపించినా అది సరికొత్త ట్రెండ్‌గా మారడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

మరి నిజంగానే భీమ్లా నాయక్ లుంగీలోకి ఎందుకు మారాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఆడియెన్స్.

ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

వెంకటేష్ ఈ సంక్రాంతి విన్నర్ నిలిచాడా..?