మెగాస్టార్‌కు చెల్లిగా అందుకే ఒప్పుకుందా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడని చెప్పాలి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను వరుసగా క్యూలో పెట్టి యంగ్ హీరోలు సైతం అవాక్కయ్యేలా చేశాడు.

ఇక మెగాస్టార్‌ను భోళాశంకర్గా చూపించేందుకు దర్శకుడు మెహర్ రమేష్ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనం చూశాం.

రాఖీ పండుగ సందర్భంగా అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి రాఖీ కడుతూ మనకు కనిపించింది.

మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్‌ను చూసి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.చిరు లాంటి స్టార్ హీరోకు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని ఎవరూ ఊహించలేదు.

దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ప్రస్తుతం కెరీర్ టాప్ స్టేటస్‌లో ఉండగానే కీర్తి సురేష్ ఇలాంటి డేరింగ్ స్టెప్ వేయడంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు సినీ ప్రేమికులు.

కాగా కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నటించేందుకు ఊరికే ఏం ఒప్పుకోలేదని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ఆమె తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కావడంతో ఆమె అడిగిన మొత్తాన్ని రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ‘భోళాశంకర్’ యూనిట్ రెడీ అయ్యిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే రీతిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.

తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు.

మరి ఈ సినిమాలో చిరు, కీర్తి సురేష్‌ల మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసుల మకాం