వారానికో సినిమా రిలీజ్ చేయడం కాదు..నిన్ను నిలబెట్టే సినిమాలు చెయ్యవయ్యా సామీ…

ఇప్పటివరకు చాలా మంది హీరోలు జాగ్రత్తగా సినిమాలు చేస్తు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఇక కొంతమంది హీరోలు మాత్రం రొటీన్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక అందులో కొంతమంది యంగ్ హీరోలు ఉండడం విశేషం.

ముఖ్యంగా రాజ్ తరుణ్ లాంటి హీరోలు పైవిద్యనైన కథాంశాలతో సినిమాలు చేయాలి.కానీ ఆయన మాత్రం రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

"""/" / ఇక గతవారం వచ్చిన 'పురుషోత్తముడు ' సినిమా( Purushothamudu ) ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది.

ఇక నాలుగైదు సినిమాలను కలిపి తీసిన సినిమాగా ఈ సినిమా స్టోరీ ఉండడం వల్లే ఇది ఫ్లాప్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ వారం వచ్చిన 'తిరగబడరా సామీ సినిమా( Tiragabadara Saami ) కూడా అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదనే చెప్పాలి.

రోటీన్ కథలతో సినిమాలు చేస్తే ఎలా సక్సెస్ అవుతారు అంటూ రాజ్ తరుణ్ ను( Raj Tharun ) కొంతమంది విమర్శిస్తుంటే ఆయన మాత్రం రొటీన్ సినిమాకే తన ఓటు అన్నట్టుగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ ప్రస్తుతం పర్సనల్ వివాదాల్లో చిక్కుకొని ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిల్లో ఉన్నాడు.

"""/" / ఇక ఈ సిచువేషన్ నుంచి బయటపడితే తప్ప ఆయన తన సినీ కెరియర్ మీద ఫోకస్ చేసే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే రాజ్ తరుణ్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా రొటీన్ సినిమాలు గానే తెలుస్తుంది.

తన కెరీర్ మొదటి నుంచి కూడా రోటీన్ సినిమాలకే ఆయన పెద్ద పీట వేస్తూ వస్తున్నాడు.

ఇక ప్రేక్షకుల అభిరుచులు మారాయి.కాబట్టి వాళ్ళు అభిరుచుల మేరకు సినిమాలు చేస్తే బాగుంటుంది.

ఇక తన పర్సనల్ వివాదం మొత్తం ముగిసిన తర్వాత తను ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందనే విషయం మీద ఆయన ఒక క్లారిటీ కి వచ్చి నిర్ణయాలను తీసుకుంటే ఆయా సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

నాటుకోడి గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయా.. వాటికి ఎందుకంత క్రేజ్!