ఎలుకలు కొరికిన ఏటీఎం డబ్బులు అని వైరల్ అయిన ఫోటో వెనుక అసలు కథ ఇదే.!
TeluguStop.com
ఏటీఎంల నుంచి జనాలకు డబ్బు రాకపోయినా ఎలుకలకు మాత్రం మేత బాగా దొరుకుతోంది.
ఎటీఎంలలో ఉంచిన నగదును ఎలుకలు చిత్తు కాగితాలుగా కొరికి వేసిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది.
టిన్సుకియా లైపులిలోని ఓ ఏటీఎంలో 12 లక్షల రూపాయలను ఎలుక తినేసింది.గత నెల 20 నుంచి అవుట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్న ఈ ఏటీఎమ్‌ను బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదు.
దీంతో ఏటీఎంలోకి చొరబడిన ఎలుక అందులో ఉన్న నోట్లను తినేసింది.నాలుగు రోజుల క్రితం ఏటీఎం రిపేరు చేసేందుకు వచ్చిన అధికారులు విషయం తెలుసుకుని ఖంగుతున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఎలుకలు తిన్న వాటిలో 500, రెండు వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
అయితే ఏటీఎంలలో పటిష్టమైన బాక్సులలో ఉంచిన నగదును ఎలుకలు తినడంపై స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిదంటూ విమర్శిస్తున్నారు.నష్టాలు చూపడం జనంపై ఎడపెడా చార్జీలు బాదడం అలవాటైన బ్యాంకు యాజమాన్యాలకు ఇలాంటి ఘటనలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు.
!--nextpage
అయితే, కొంతమంది ఇది ‘ఫేక్ న్యూస్’ అని ఖండించగా.
అది అసలు ఏటీఎం కాదని మరికొందరు వాదించారు.ఎట్టకేలకు ఇదంతా నిజమేనని తేలింది.
ఎక్కడ జరిగిందో కూడా తెలిసింది.అస్సంలోని తిన్సుకియా ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక పత్రికల కథనం ప్రకారం.ఆ ఏటీఎం మే 20 నుంచి పనిచేయడం లేదు.
జూన్ 11న బ్యాంకు అధికారులు వచ్చి తనిఖీ చేయగా.డబ్బులన్నీ చిరిగిపోయి కనిపించాయి.
ఎలుకలు కొరికేసిన ఈ మొత్తం నగదు విలువ రూ.12.
38 లక్షలని తేలింది.గ్లోబల్ సొల్యూషన్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏటీఎం నడుస్తోంది.
ఆ సంస్థ సిబ్బంది మే 19న మొత్తం రూ.29 లక్షలు ఏటీఎంలో నింపారు.
ఆ తర్వాతి రోజు నుంచి ఏటీఎం పనిచేయడం మానేసింది.అయితే, ఈ ఏటీఎంలో సమస్య వచ్చిన 20 రోజులు తర్వాత అధికారులు వెళ్లి తనిఖీ చేయడంపై అనుమానాలు నెలకున్నాయి.
వాటిని కొట్టేసింది ‘ఎలుకలా?’ లేదా.అవకతవకలకు అలవాటుపడ్డ ‘పందికొక్కులా?’ అనే అనుమానం నెలకొంది.