పూరి జగన్నాథ్ ఈ స్టార్ హీరో తో ఎందుకు సినిమా చేయడం లేదు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్( Director Puri Jagannath ) లాంటి స్టార్ డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఈయన స్టార్ హీరోలతో కాకుండా యంగ్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.
దానివల్లే అతనితో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి సపరేట్ క్యారెక్టరైజేషన్ వస్తుంది.ఇక అందులో భాగం గానే ఆయన రామ్ ను హీరోగా పెట్టి 'డబల్ ఇస్మార్ట్'( Double Ismart ) అనే సినిమా చేస్తున్నాడు.
ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది.ఇక ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టబోటున్నాం అని పూరి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
"""/"/
ఇక ఇది ఇలా ఉంటే పూరి రాసే హీరోలా క్యారెక్టరైజేషన్ కి ఆయన డైలాగ్ లకి బాగా సెట్ అయ్యే ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు.
అయిన కూడా పూరి ఆయనతో సినిమా చేయట్లేదు అని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరి ఆయన ఎవరు అంటే 'మాస్ కా దాస్'( Maas Ka Daas ) గా మంచి గుర్తింపు సంపాదించుకున్న 'విశ్వక్ సేన్ '( Vishwak Sen ).
నిజానికి విశ్వక్సేన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో ఆయన సినిమా చేస్తే ఆయన కెరియర్ అనేది ఇంకా సాఫీగా సాగుతుందనే చెప్పాలి.
"""/"/
ఎందుకంటే పూరి ఎలాంటి ఆటిట్యూడ్( Attitude ) తో ఉంటాడో విశ్వక్ సేన్ బిహేవియర్ కి చాలా దగ్గరగా ఉంటుంది.
కాబట్టి వీళ్ళ కాంబో లో సినిమా వస్తే ఆ సినిమా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటుందనే చెప్పాలి.
ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ కాంబో లో తొందర్లోనే సినిమా రాబోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
మా చట్టాలను గౌరవిస్తే అమెరికా అవకాశాల గని.. లేదంటే : భారతీయ విద్యార్ధులకు వార్నింగ్