‘కన్నప్ప’ కోసం ప్రభాస్ ను ఆ సెంటిమెంట్ తో ఒప్పించారా?

ప్రస్తుతం టాలీవుడ్ లో పలు క్రేజీ కాంబోలు తెరకెక్కుతున్న నేపథ్యంలో తాజాగా మరో కాంబో తెరమీదకు వచ్చింది.

మేకర్స్ ఈ ఇంట్రెస్టింగ్ కాంబోను సెట్ చేయగా ఇది నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

మంచు విష్ణు ఏ సినిమా చేసిన ప్లాప్ అవుతూనే ఉంది.అయినప్పటికీ పట్టువదలకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఇక జిన్నా వంటి ప్లాప్ తర్వాత కొద్దీ గ్యాప్ తో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''భక్త కన్నప్ప''.

( Bhakta Kannappa ) ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.ఎప్పటి నుండో అనుకుంటున్న కూడా ఈ సినిమా మాత్రం పట్టాలెక్కలేక పోయింది.

కానీ ఎట్టకేలకు ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ ( Nupur Sanon )హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

ఇందులో ప్రభాస్ కీ రోల్ పోషిస్తున్నాడు అంటూ టాక్ బయటకు వచ్చింది. """/" / డార్లింగ్ ఉన్నాడు అనే టాక్ తో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.

అయితే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఒక వైపు భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటే మళ్ళీ ఈ సినిమాలో క్యామియో రోల్ కూడా చేసేందుకు ఒప్పుకున్నాడు అనేది అందరికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

మరి మంచు ఫ్యామిలీ ప్రభాస్( Prabhas ) ను ఎలా ఒప్పించాడు అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

"""/" / ప్రభాస్ వంటి స్టార్ హీరోకు ఈ సినిమాలో చేయాల్సిన పనే లేదు.

కానీ కన్నప్ప విషయంలో ఒకే ఒక్క సెంటిమెంట్ తో ప్రభాస్ ను లాక్ చేసినట్టు టాక్.

మరి ఆ సెంటిమెంట్ ఏంటి అంటే.ప్రభాస్( Prabhas ) పెద్దనాన్న కృష్ణం రాజు( Krishnam Raju ) గారికి 'కన్నప్ప' సినిమా చేయాలనీ కల.

ప్రభాస్ తో ఈ సినిమా చేయాలని తాను డైరెక్షన్ చేయాలని ఆశ పడితే ఆయన ఆరోగ్యం సహకరించలేదు.

ఆయన కోరిక తీరకుండానే మరణించారు.మరి ఇదే స్క్రిప్ట్ తో మంచు విష్ణు సినిమా చేయనున్నాడు.

పెద్దనాన్న కల అనే ఒకే ఒక్క సెంటిమెంట్ తో ఏఈ సినిమాను ప్రభాస్ ఓకే చేసి ఉంటాడు అని టాక్.

ఇందులో శివుడిగా నటిస్తున్నాడు.ఇది ఒకే ఒక్క రోజు షూట్ కు వెళ్లిన పూర్తి అవుతుంది.

అందుకే ఈయన ఓకే చేసి ఉండవచ్చు అంటున్నారు.

మహాకుంభ్ మోనాలిసా సంచలనం.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిన వైరల్ గర్ల్?