అతడి కోసం దర్శకత్వం త్యాగం చేసిన సుహాసిని .. కారణం ఏంటి.. ?
TeluguStop.com
సుహాసిని.తెలుగు సినిమా పరిశ్రమలో ఈమె గురించి తెలియని వారుండరు.
తెలుగు రాష్ట్రాల్లో ఈమె సినిమాను చూడని వారుండరు.ఇప్పటికీ వన్నె తగ్గని ఈ ముద్దుగుమ్మ.
కేవలం నటి మాత్రమే కాదు.ఆమె సినిమాటోగ్రఫీలో ట్రైనింగ్ అయ్యారు.
స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశారు.డైరెక్షన్ కూడా చేశారు.
వీటన్నింటిలో ఆమెకు బాగా నచ్చింది నటులను డైరెక్ట్ చెయ్యడం.1996లోనే ఇందిర అనే సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు.
ఆ సినిమా తీసిన తర్వాత ఆమె మళ్లీ డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టలేదు
తాజా ఈ అంశానికి సంబంధిన పలు విషయాలు ఆమె వెల్లడించారు.
కేవలం ఒకే సినిమాకు దర్శకత్వం చేశారు.ఆ తర్వాత ఏ కారణం చేత కొనసాగించలేకపోయారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు సుహాసిని.
ఎందుకు మళ్లీ డైరెక్షన్ చెయ్యలేదంటే మణిరత్నం భార్యని కావడం వల్లే.ఇంట్లో ఒక డైరెక్టర్ ఉంటే చాలని ఆయన అన్నారు.
ఆగిపోయాను.డైరెక్షన్ అనేది శారీరకంగా, మానసికంగా చాలా కష్టమైన పని.
అందుకే దాన్ని ఆయనకే వదిలేశాను.విమెన్ ఆర్ లైక్ దట్.
అని ఆమె చెప్పింది. """/"/
ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొంటూ భారతీయ సినిమాని ప్రపంచ సినిమాకి చేరువ చేయాలని సుహాసిని కృషి చేస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలనేది తన కోరికగా వెల్లడించింది.
అందుకే అప్పుడుప్పుడు మనవాళ్లకు ఫోన్ చేస్తుంటా.ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పమని వెల్లడించింది.
నటిగా మొదట్లో అన్నీ నాకే తెలుసు అనే పొగరుతో ఉండేదాన్నని సుహాసిని చెప్పారు.
కానీ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాక నలుగురితో ఎలా నడచుకోవాలో.క్రమ శిక్షణతో ఎలా ఉండాలో నేర్చుకున్నట్లు తెలిపింది.
ఈ విషయాన్ని మణిరత్నం ముందు ముందు కూడా గట్టిగా చెబుతాను.నా కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ను ఇక్కడే గడిపా కాబట్టి తెలుగు సినిమాతో నా అనుబంధం మరింత బలపడినట్లు చెప్పింది.
రామ్ చరణ్ బుచ్చిబాబు మీద అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి గల కారణం ఏంటి..?