ట్రెడ్ మిల్ చేసేటప్పుడు గుండె పోటుకు గురవ్వడానికి గల ముఖ్యమైన కారణాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో అధిక బరువు( Overweight )ను దూరం చేసుకోవడానికి చాలామంది ప్రజలు జిమ్ లో కసరతులు చేస్తున్నారు.

జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు.ఇలా చేస్తున్నప్పుడు చాలామందిలో గుండెపోటు రావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా చెప్పాలంటే ట్రెడ్ మిల్ పై ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి చాలామంది చనిపోతున్నారు.

ప్రస్తుత సమాజంలో 19 సంవత్సరాల వయసు ఉన్నవారు ట్రెడ్ మిల్ చేస్తూ చనిపోతున్నారు.

ట్రెడ్ మిల్( Treadmill ) మీద ఉన్నప్పుడు గుండెపోటు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఆ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. """/" / క్రమం తప్పకుండా వ్యాయమం చేసే అలవాటు లేని వ్యక్తులు గుండెపోటు( Heart Attack )కు గురవుతున్నారు.

ఆకస్మిక శ్రమతో కూడిన చర్య రక్తపోటు హృదయస్పందన రేటు పెరుగుదలకు కారణమవుతోంది.గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారిలో ఉండే ఫోటో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా తీవ్రమైన వ్యాయామాల సమయంలో డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఈ ప్రమాదాలను మరింత పెంచే అవకాశం ఉంది.

ట్రెడ్ మిల్ వ్యాయామ నియమావళి( Treadmill Exercise )ని ప్రారంభించే ముందు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

"""/" / గుండె కండరాలకు సరఫరా చేసే కొరోనరీ ఆర్టరీ డిసీజ్( Coronary Artery Disease ) వంటి అంతర్లీన గుండె పరిస్థితిలో ఉండడం ప్రాథమిక కారణాలలో ఒకటి.

మీరు ట్రెడ్ మిల్ పై వ్యాయామం చేసేటప్పుడు మీ గుండె కష్టపడి పని చేయాల్సి ఉంటుంది.

ఈ నాళాలలో అడ్డంకులు ఏర్పడడం వల్ల రక్త ప్రవాహం తగ్గితే అది గుండెపోటుకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది.

తీవ్రమైన వ్యాయామం చేసే ముందు సరిగ్గా వార్మప్ చేయకపోవడం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

భావోద్వేగా ఒత్తిడి, ఆందోళన కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల అడిషనల్ పెరుగుదలకు గురవుతారు.