కేసీఆర్ ఫ్యామిలినే ‘ బండి ‘ టార్గెట్ ? కారణం ఇదేనా ? 

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.ఇటీవల కాలంలో కాంగ్రెస్( Congress ) దూకుడు ప్రదర్శిస్తూ వస్తుంది.

పార్టీలోనూ , ప్రభుత్వంలోనూ తనకు తిరిగే లేదన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేసే విధంగా బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తూ , ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ.

జనాల్లో తమకు ఆదరణ పెరిగేలా ప్రయత్నాలు చేస్తుండడం .బిజెపి ఈ విషయంలో వెనకబడిపోయిందనే అభిప్రాయాలు జనాల్లోకి బాగా వెళ్లాయి.

దీంతో బిజెపి కూడా రంగంలోకి దిగింది.ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేస్తూనే అనేక విమర్శలు చేస్తూ వస్తోంది.

"""/" / దీంతోపాటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay ) విమర్శలు చేస్తున్నారు.

 ముఖ్యంగా కేసీఆర్( KCR ) కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని బండి సంజయ్ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశం గా మారాయి.

గతంలో కంటే ఎక్కువగా బీఆర్ఎస్ పై బిజెపి , బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు.

దీంతో బండి సంజయ్ ఈ స్థాయిలో విమర్శలు చేయడం వెనుక కారణంగా ఏంటి అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

వాస్తవంగా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటారు.

"""/" / అయితే దానికి భిన్నంగా తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను( BRS ) ఎక్కువగా టార్గెట్ చేసుకుని బండి సంజయ్ చేస్తున్న విమర్శల వెనుక కారణాలు ఏమిటి అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

అసలు బీఆర్ఎస్ తో పాటు,  కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని బండి సంజయ్ విమర్శలు చేయడం వెనక చాలా రాజకీయమే ఉన్నట్లుగా చర్చకు వస్తుంది.

బిజెపితో( BJP ) బీఆర్ఎస్ ఒప్పందం  కుదుర్చుకున్నదని కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడం,  అవి జనాలలోకి బాగా వెళుతుందడం తో,  ఆ విమర్శలకు బ్రేక్ వేసేందుకు బీఆర్ఎస్ ను ఎక్కువగా టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలలో వాస్తవం లేదనే విషయాన్ని చాటి చెప్పేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నట్లుగా అర్థం అవుతోంది.

విరూపాక్ష డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త సినిమా.. వైరల్ అవుతున్న పోస్టర్!