Ravi Krishna : ఈ 20 ఏళ్లలో 700 కథలు విన్నాను..ఏది నచ్చక నటించలేదు

2004 Lo 7జి బృందావన్ కాలనీ( 7G Brindavan Colony ) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఏ.

ఎమ్ రత్నం కుమారుడు రవికుమార్.తండ్రి నిర్మాతగా తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయమే అదే కారణంగా కొడుకుకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే దొరికింది.

సెల్వరాఘవన్( Selva Raghavan ) దర్షకత్వంలో 7 జి బృందావన్ కాలనీ అనే సినిమా ద్వారా మొట్టమొదటిగా హీరోగా పరిచయమయ్యాడు.

ఇదే సినిమా 7 జి రెయిన్బో కాలనీ పేరుతో తమిళ్ లో కూడా రూపొందింది.

ఇది రెండు భాషల్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా రవి కృష్ణ కూడా ఒక స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు.

"""/"/ కానీ మొదటి సినిమా ప్రభావం రవి కృష్ణ కెరియర్ పై తీవ్రంగా ఉంది.

అదే స్థాయిలో మరో సినిమా వస్తుందని అందరూ ఆశించగా అలాంటి సినిమాలు రవి కృష్ణ( Ravi Krishna ) కి రాకపోవడంతో అందరూ నిరాశ చెందారు.

దాంతో హీరోగా సినిమాలు తగ్గాయి.కెరియర్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది.

రవి కృష్ణ చివరగా నటించిన సినిమా తమిళ్ లో 2011లో విడుదల కాగా దాదాపు పుష్కర కాలం పాటు మళ్ళీ మొహానికి మేకప్ వేసుకోలేదు.

అయితే ప్రస్తుతం 7 జి బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్( 7G Brindavan Colony Sequel ) రూపొందితుండడంతో అందరూ మరోసారి ఆసక్తిగా ఇలాంటి సినిమా రాబోతుందో అని ఎదురు చూస్తున్నారు.

"""/"/ అయితే చాలామంది ఇన్నేళ్ల పాటు రవి ఎందుకు సినిమాలు తీయడం లేదు అంటూ అనేకసార్లు సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు ఈ విషయంపై రవి కృష్ణ ఇప్పుడు మొదటిసారిగా తన ఆ వివరణ ఇచ్చుకున్నాడు.

చాలామంది నేను బృందావన్ కాలనీ వంటి సినిమా తీయడం లేదని ఆ తర్వాత అసలు సినిమాల్లోనే కనిపించలేదని అనుకుంటున్నారు.

కానీ ఈ 20ఈ  ఏళ్ల కాలంలో దాదాపు 600 నుంచి 700 వరకు కథలు విన్నాను.

నా వరకు కథ బాగుంటేనే సినిమా బాగుంటుంది.స్క్రిప్ట్ లెవెల్ లో బాగా లేని సినిమాలు ఎలా ప్రేక్షకులను మెప్పించగలవు అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను.

మళ్ళీ ఇప్పుడు మీ అందరి ముందుకు రాబోతున్నాను అంటూ రవికుమార్ తెలియజేశారు.

ఎట్టకేలకు పుష్ప సినిమాకు విష్ చేసిన మెగా హీరో.. బన్నీ రిప్లై ఇస్తాడా?