భారతీయుడు2 డిజాస్టర్ కావడం చరణ్ మూవీకి అలా ప్లస్ అయిందా.. ఏం జరిగిందంటే?

ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో పాటు నిర్మాతలను ముంచేసిన సినిమాలలో భారతీయుడు2 ( Indian 2 )ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

భారతీయుడు2 సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే భారతీయుడు2 డిజాస్టర్ కావడం చరణ్ మూవీకి ప్లస్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భారతీయుడు2 ఫ్లాప్ కావడంతో శంకర్( Shankar ) ఫోకస్ మొత్తం మారిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రస్తుతం శంకర్ గేమ్ ఛేంజర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

భారతీయుడు2 సినిమా రిజల్ట్ తో ఇండియన్3 మూవీ తాత్కాలికంగా వాయిదా పడిందని భోగట్టా.

"""/" / ఇండియన్3 మూవీ( Indian3 Movie ) 2026 సంవత్సరంలో రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇండియన్3 మూవీ విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం సులువు కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీకి బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతోంది.గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

"""/" / గేమ్ ఛేంజర్ రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశం లేదనే క్లారిటీ ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

చరణ్ గేమ్ ఛేంజర్ శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

మెరూన్ రంగు లో డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్నకృతి శెట్టి ..