Realme 12X 5G : రియల్ మీ 12X 5G స్మార్ట్ ఫోన్ ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. లాంచింగ్ ఎప్పుడంటే..?

రియల్ మీ 12X 5G( Realme 12x 5G ) స్మార్ట్ ఫోన్ మైమరిపించే ఫీచర్లతో ఏప్రిల్ రెండవ తేదీ భారత మార్కెట్లో విడుదల కానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో పాటు ధర వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.

రియల్ మీ 12X 5G స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్ ప్లే తో ఉంటుంది.

120Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్, 6nm మీడియా టెక్ డైమెన్సిటి, 6100+5G చిప్ సెట్ తో వస్తుంది.

ఆండ్రాయిడ్ 14( Android 14 ) ఆధారంగా OS పై పని చేస్తుంది.

IP 54 రేటింగ్, VC కూలింగ్ టెక్నాలజీతో రానుంది. """/" / ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 45W సూపర్ VOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది.

కేవలం 30 నిమిషాలలో 50శాతం చార్జింగ్ అవుతుంది.ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.

ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను( Dual Camera ) కలిగి ఉంటుంది.

50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది.మిగిలిన కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

డైనమిక్ బటన్ మరియు ఎయిర్ గెశ్చర్స్ కూడా కలిగి ఉంటుంది. """/" / ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.

ఈ హ్యాండ్ సెట్ ధర రూ.12000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ కీలక ప్రకటన చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ రెండవ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల కానుంది.

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ విడుదల కార్యక్రమాన్ని లైవ్ లో యూట్యూబ్, ఫేస్ బుక్, అధికారిక వెబ్సైట్ ద్వారా వీక్షించవచ్చు.

ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

పోలీస్‌కే చుక్కలు చూపించిన దున్నపోతు.. అతను ఏం చేశారో చూస్తే..??