యువత పెడుదారిన పడొద్దు తల్లిదండ్రుల కళను సాకారం చేయండి – సీఐ శశిధర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా :యువత పెడుదారిన పడొద్దని తల్లిదండ్రుల కళను సాకారం చేసుకుని ఉన్నతమైన ఉద్యోగాలలో రాణించాలని సీఐ శశిధర్ రెడ్డి( CI Shasidhar Reddy ) పిలుపునిచ్చారు.

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో శనివారం పోలీస్ కమ్యూనిటీ మీటింగును జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ( SP Akhil Mahajan )ఆదేశాల మేరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ కు బానిస కావద్దని తల్లిదండ్రులు కూడా పిల్లల మీద దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

అదేవిధంగా గ్రామంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన 100 నెంబర్ కు డయల్ చేయాలని తెలిపారు.

గ్రామంలోని ప్రవేశించే దారుల వద్ద నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని వాటి ద్వారా నేరస్తులను గుర్తించడానికి సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై రమాకాంత్( SI Ramakanth ), పోలీస్ సిబ్బంది,గ్రామ సర్పంచ్ మంగోలి నర్సాగౌడ్, ఉప సర్పంచ్ ఉస్మాన్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మూడోతరం వారసుడు.. అవ్రామ్ లుక్ పై విష్ణు ఎమోషనల్ పోస్ట్!