Sambho Siva Sambho: శంభో శివ శంభో సినిమా నిజ జీవితంలో ఎవరికి జరిగిందో తెలుసా ?

రవితేజ అల్లరి నరేష్ శివ బాలాజీ హీరోలు గా శంభో శివ శంభో( Sambho Siva Sambho ) అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా చాలా న్యాచురల్ గా ఎంతో రియాలిటీ కి దగ్గరగా ఉంటుంది.

ఈ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది.అంతగా జనాల్లో మంచి అభిమానాన్ని దక్కించుకుంది.

అయితే ఈ సినిమా ల్లో జరిగినట్టుగానే నిజ జీవితంలో కూడా అచ్చు ఇలాంటి సంఘటనే జరిగిందట దాన్ని ఆధారంగా తీసుకునే దర్శకుడు సినిమాగా తెలకెక్కించారట.

నిజ జీవితంలో జరిగిన తప్పులు మళ్ళీ ఎవరూ చేయకూడదు అనే ఉద్దేశంతోనే దర్శకుడు ఈ సినిమా రూపంలో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇంతకీ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరు ఏంటి సంఘటన జరిగింది ఎందుకు ఈ సినిమా తీయాల్సి వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / అయితే ఈ సినిమాలో నటించినట్టుగానే ముగ్గురు ఫ్రెండ్స్ నిజ జీవితంలో కూడా ఉన్నారు.

ఆ ముగ్గురిలో ఒక పాత్రే ఈ సినిమా దర్శకుడిది కాగా మిగతా ఇద్దరు అతడి స్నేహితులు.

ఇంతకీ పాత్ర ఎవరిదో తెలుసా ? అతడు మరెవరో కాదు దర్శకుడు సముద్రఖని.

తన జీవితంలో నిజంగానే ఇద్దరి ప్రేమికులకు పెళ్లి చేశారు సముద్రఖని( Samuthirakani ) మరియు అతని స్నేహితులు.

సముద్రఖని తన స్నేహితులు ఎంతో కష్టాలకు నిలబడి వారిద్దరికీ పెళ్లి చేశారట.కానీ వారు చిన్న చిన్న కారణాలకి గొడవ పడి విడిపోయారట.

అలా ప్రేమ, పెళ్లి విలువ తెలియని వారికి పెళ్లి చేసి కష్టాలు అనుభవించడం ఎంతటి తప్పు తెలియాలని ఆ తప్పు మరి ఎవరు చేయకూడదని ఉద్దేశంతో ఈ సినిమా తీసి ప్రేక్షకుల ముందు పెట్టారట.

"""/" / ఈ ముగ్గురు స్నేహితులలో నిజ జీవితంలో సముద్రఖని పాత్రను అల్లరి నరేష్( Allari Naresh ) పోషించాడు.

ఈ సినిమా చూసినా సరే కొందరైనా మారుతారని నమ్మకంతో తన సొంత కథనే సినిమాగా తీశాడు సముద్రఖని ఏది ఏమైనా ఆ స్నేహానికి విలువ ఇచ్చి ఈ ముగ్గురు స్నేహితులు చేసిన పని చాలా గొప్పది కానీ దాని నిలబెట్టుకోలేక పోయిన ఆ ప్రేమికుల నిజమైన దురదృష్టవంతులు.

ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి ప్రేమ ఏంటి? దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి తెలుసుకోవాలి.

మీ అభిమానం చల్లగుండ.. ఒకే పోస్టర్ లో ఇన్ని వెరియేషన్స్!