Businessman : మహేష్ బాబు బిజినెస్ మెన్ మూవీ రియల్ స్టోరీ అంట..ఎవరి స్టోరీ తెలుసా?
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన బిజినెస్ మెన్ సినిమా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.
మహేష్ బాబు కెరీర్ లోనే ఇది ఒక స్టైలిష్ సినిమా అని చెప్పాలి.
సూర్య అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అంటూ సినిమాలో మహేష్ బాబు డైలాగులు, ఫైట్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ కి కూడా సిద్దమవుతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో, గ్యాంగస్టర్ గా కనిపించారు.
ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కాజల్ నటించింది.ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు.
మహేష్ బాబు కెరీర్ లో బిజినెస్ మెన్ ఒక మర్చిపోలేని సినిమా అని చెప్పొచ్చు.
సినిమా మొత్తం ముంబై మీదే జరుగుతుంది.అయితే ఇప్పుడు బిజినెస్ మెన్ సినిమా గురించి ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
ఒకరు నిజంగానే ముంబైకి వెళ్లి ఇలా గ్యాంగస్టర్ గా ఎదిగారంట.ఆయనో ఎవరో, అసలు ఆయన కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
"""/" /
సతువాచారి వరదరాజన్ ముదలియార్( Varadarajan Mudaliar ) అనే వ్యక్తి 1960 లో ముంబై వెళ్లి అక్కడ ఒక గ్యాంగస్టర్ గా ఎదిగారంట.
సతువాచారి వరదరాజన్ ముదలియార్ అక్టోబర్ 9 1926 లో జన్మించగా, జనవరి 2 1988 లో మరణించారు.
అయితే ఈయన ముంబై వెళ్లి ఒక గ్యాంగస్టర్ గా ఎదిగారట.ఈయననే వర్ధాభాయ్ మరియు వర్ధ అని కూడా పిలిచేవారంట.
ఈయనను భారతీయ క్రైమ్ బాస్ అనేవారు.ఈయన నిజ జీవిత కథ ఆధారంగానే పూరి జగన్నాధ్ మహేష్ బాబుతో కలిసి బిజినెస్ మెన్ సినిమాని తీశారు.
అయితే ఈ సినిమాను మహేష్ బాబు కంటే ముందు మరో హీరోని అనుకున్నారు.
ఆ హీరో ఎవరో కాదు.సూర్య( Surya )అవును ముందు ఈ సినిమాని సూర్యతోనే ప్లాన్ చేసారు.
"""/" /
కానీ సూర్యకి డేట్స్ సెట్ కాకపోవడంతో ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు.
ఆ తరువాత ఈ కథ మహేష్ బాబు దగ్గరికి వచ్చింది.మహేష్ కి కథ నచ్చడంతో వెంటనే సినిమాని తీసేసారు.
అంతేకాదు ఈ సినిమాలో పిల్లా చావో అంటూ ఒక పాత ఉంటుంది.అయితే Bella Ciao అనే పాప్ ఇటాలియన్ పాటను బిజినెస్ మెన్ సినిమాలో పిల్లా చావో అంటూ తీశారు.
మొత్తానికి బిజినెస్ మెన్ సినిమా ఒక రియల్ గ్యాంగస్టర్ కథ అని చాలా మందికి తెలీదు.
అయితే ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
ఇదేందయ్యా ఇది.. తీసేకొద్దీ బంగారం, డబ్బులు (వీడియో)