ఇది రియల్ లైగర్.. చూస్తే గుండె జారి గల్లంతవ్వాల్సిందే!

విజయ్ దేవరకొండ మూవీ లైగర్.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇటీవల విడుదలైన లైగర్ చిత్ర ట్రైలర్ కూడా అంచనాలను మరి కాస్త పెంచిందనే చెప్పాలి.

ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమా పేరు లైగర్ కావడంతో అసలు అలాంటి జంతువులు ఉన్నాయా.

ఉంటే ఎక్కడ ఉన్నాయి.అసలు అవి ఎలా పుట్టాయి అనే వివరాలపై చాలా మంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.

లైగర్ అంటే.సింహం, పులి కలయిక ద్వారా వచ్చే జీవిని లైగర్ అంటారు.

మగ సింహం, ఆడ పులిని నుండి వచ్చే హైబ్రిడ్ జంతువే లైగర్.లైగర్ సినిమా ట్రైలర్ లోనూ రమ్య కృష్ణ వాయిస్ బ్యాక్ గ్రౌండ్ లో దీని గురించి చెబుతుంది.

సింహానికి, పులికి పుట్టిన లైగర్ రా నా బిడ్డ అని అంటుంది.అడవిలో సింహం, పులి చాలా పవర్ ఫుల్ యానిమల్స్ అని అందరికీ తెలిసిందే.

అయితే.ఈ రెండింటి నుండి వచ్చిన హైబ్రిడ్ జంతువు మరింత పవర్ ఫుల్ గా ఉంటుందన్న అర్థంతో ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ పెట్టారు దర్శకుడు పూరి జగన్నాథ్.

భూమిపై నిజమైన లైగర్లు ఉన్నాయి.ఈ జంతువులను మగ సింహం నుండి తీసిన స్పెర్మ్ లను, ఆడ పులి అండంతో కలిసేలా చేస్తారు.

అలా పిండం అభివృద్ధి చెందుతుంది.ఆ విధంగా లైగర్ లను పుట్టిస్తారు.

దేశానికి ఏం సేవ చేశాడు : నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ నివాళిపై భారత సంతతి ఎంపీ అసంతృప్తి