ఒకప్పుడు రూ.200 జీతం తీసుకునే గుమస్తా.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. ఎలా సక్సెస్ అయ్యాడంటే?
TeluguStop.com
కెరీర్ పరంగా ఎదగాలంటే ఒక్కో మెట్టు పైకి ఎక్కాలనే సంగతి తెలిసిందే.అయితే కొంతమందికి మాత్రం ఎంత కష్టపడినా అదృష్టం వరించదు.
మరి కొందరికి మాత్రం కృషికి ఆవగింజంత అదృష్టం కలిసొచ్చి కెరీర్ పరంగా ఉన్నతస్థానాలకు ఎదుగుతారు.
ఒకప్పుడు 200 రూపాయల జీతానికి పని చేసిన వ్యక్తి ప్రస్తుతం వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు.
రఫీక్ జివాని( Rafiq Jivani ) సక్సెస్ స్టోరీ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందేనని చెప్పవచ్చు.
రఫీక్ జివాని ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతితోనే చదువును ఆపేయాల్సి వచ్చింది.
రోజుకు ఒక పూట మాత్రమే రఫీక్ జివాని భోజనం తినేవారు.రోజుకు నాలుగు గంటలు మాత్రమే రఫీక్ నిద్రించేవారు.
బిజినెస్ లోకి( Business ) వచ్చిన రఫీక్ ఎంతో కష్టపడి సక్సెస్ సాధించారు.
అసిఫాబాద్ కు రఫీక్ తొమ్మిదిమంది సంతానంలో పెద్ద కొడుకు.హోల్ సేల్ వ్యాపారి దగ్గర 1981 నుంచి 1983 వరకు గుమస్తాగా రఫీక్ పని చేశారు.
"""/" /
ఆ తర్వాత మరో జాబ్ లో చేరిన రఫీక్ 400 రూపాయల వేతనానికి పని చేశారు.
ఆ తర్వాత రఫీక్ కిరాణా హోల్ సేల్, రిటైల్ బిజినెస్ ను మొదలుపెట్టారు.
తమ్ముళ్ల సహకారంతో బిజినెస్ విషయంలో ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతూ వచ్చారు.హోల్ సేల్ వ్యాపారంలో రాణించడంతో పాటు రైస్ మిల్ తో ( Rice Mill ) కూడా రఫీక్ సక్సెస్ అయ్యారు.
అయితే తర్వాత రఫీక్ రైస్ మిల్ బిజినెస్ లో నష్టాలు రావడంతో దానిని అమ్మేశారు.
"""/" /
ఆ తర్వాత జిన్నింగ్ మిల్స్ బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చిన రఫీక్ ఈ మిల్స్ ద్వారా 400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
వేల కోట్ల రూపాయలకు అధిపతి అయినా రఫీక్ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.
పేదింటి అమ్మాయిని వివాహం చేసుకున్న రఫీక్ తన పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.