పాత ముచ్చటే ..కానీ ఎప్పటికైనా ఈ ముగ్గురికి న్యాయం జరుగుతుందా ?

నాటు నాటు పాటకు కీరవాణి కి గోల్డెన్ గ్లోబ్ దక్కింది.సంతోషమే.

కానీ ఆ అవార్డు కి అసలైన హక్కుదారులు ఎవరు ? ఇదంతా పాత ముచ్చటే అయినా కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా మాట్లాడుకోవాల్సిన విషయం.

ఏ సినిమా పాట హిట్ అయినా, అవార్డు దక్కించుకున్న ఆ పాటకు మొదటి హక్కు దారుడు రాసిన రైటర్, ఆ తర్వాత పాడిన సింగర్, చివరగా ఆ పాటను కళ్ళకు కట్టినట్టు అందంగా కొరియోగ్రఫీ చేసిన డ్యాన్స్ మాస్టర్ ది.

ఈ ముగ్గురి తర్వాత ఆ పాటకు ట్యూన్ కట్టిన సంగీత దర్శకుడు వస్తాడు.

ఇక ఇంత చేసిన ఈ ముగ్గురికి ఎలాంటి క్రెడిట్ దక్కలేదు.ఈ సినిమా లో నటించిన హీరోలకు మరియు దర్శక నిర్మాతలకు ఈ ముగ్గురు ఇంత బరువు అయ్యారా ? అంత మందీ అవార్డు కోసం వెళ్ళినప్పుడు వీరిని కూడా తీసుకెళ్తే వారి కెరీర్ లో ఒక గొప్ప గుర్తింపు దక్కేది కదా ? ఇక పాట రాసిన చంద్ర బోస్ విషయానికి వస్తే ఆ అవార్డు ప్రకటించిన తర్వాత మీడియా ఛానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ సదరు అవార్డు ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాడు.

ఇక చిరంజీవి కూడా పిలిచి సన్మానించిన దక్కిన గుర్తింపు నామ మాత్రమే.ఇక సింగర్స్ విషయానికి వస్తే కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్.

"""/"/తండ్రి కి వచ్చిన అవార్డు ని తన అవార్డు అనుకోని కాల భైరవ ఎంజాయ్ చేస్తున్నాడు.

అందుకే అతడికి స్పెషల్ గా గుర్తింపు అక్కర్లేదు. """/"/ ఇక రాహుల్ సిప్లిగంజ్ కి మాత్రం ఆ అవార్డు తాలూకా గౌరవం దక్కే తీరాలి.

అతడు నాయి బ్రాహ్మణా కుటుంబం లో పుట్టి సింగర్ గా సొంత కాళ్లపై ఎదుగుతున్నాడు.

అంత పెద్ద అవార్డు వచ్చిన చోట రాహుల్ కి కాస్త గౌరవం ఇచ్చి ఉంటె, టీమ్ గుర్తు చేసుకొని ఉంటె అతడి స్థాయి ఇప్పుడు మరోలా ఉండేది.

ఇక చివరగా ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేసింది ప్రేమ్ రక్షిత్.

ఇప్పటికే 80 కి పైగా సినిమాల్లో డ్యాన్సులు కంపోజ్ చేసి, ఒక పాట కోసం 65 రోజులు ఉక్రెయిన్ లో పని చేసాడు.

ఈ ఒక్క పాట కోసం 70 రకాల వేరియేషన్స్ ప్రయత్నించాడు.అంత సీనియర్ డ్యాన్స్ మాస్టర్ అయినా కూడా ఒక నెలలో 97 డ్యాన్స్ మూమెంట్స్ క్రియేట్ చేసాడట ఈ పాట కోసం.

ఇంత చేస్తే అతడికి దక్కింది ఏమిటి ? ఒక్కసారి ఆలోచించు రాజమౌళి !.

యూపీలో ప్రత్యక్షమైన కొత్త రకం తాచుపాము.. రీసెర్చర్లు చెప్పిన మాట వింటే..??