Villain Ramireddy: విలన్ రామిరెడ్డి మరణం వెనుక ఇంత కథ నడిచిందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్స్ అంటే పెద్ద పెద్ద మీసాలు గడ్డాలు పెంచుకొని భారీ శరీర కాయంతో ఉంటారు.

ఇలా పాత సినిమాలలో విలన్స్ అంటేనే భయంకరంగా ఉండేవారు అయితే ఇప్పుడు మాత్రం విలన్స్ హీరోలతో పాటు సమానంగా అందంగా చాలా స్మార్ట్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు.

ప్రస్తుత కాలంలో అయితే ఎంతో మంది విలన్స్ వస్తున్నారు కానీ గతంలో మాత్రం విలన్స్ అంటే కొందరు మాత్రమే గుర్తుకు వచ్చేవారు అలాంటి వారిలో నటుడు రామిరెడ్డి ఒకరు.

సినిమాలలో రామి రెడ్డి( Villain Ramireddy ) విలన్ పాత్ర పోషించారు అంటే ఆ పాత్రలో ఆయన జీవించేస్తారు అని చెప్పాలి.

అలా ఈయన ఆ పాత్రలో లీనమై పోయి నటిస్తుంటారు ఈయన చేసే పాత్రకు 100% న్యాయం చేస్తారు.

ఈ విధంగా రామిరెడ్డి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

250 కి పైగా సినిమాలలో నటిస్తూ ఎన్నో పురస్కారాలను అవార్డులను కూడా అందుకున్నారు.

ఈ విధంగా ఎన్నో పురస్కారాలను అందుకున్నటువంటి రామిరెడ్డి 2011 వ సంవత్సరం నవంబర్ 14వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.

"""/" / ఇక ఈయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడాల్సి వస్తే ఈయనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేదు అసలు నటన అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి రామిరెడ్డి జర్నలిజం చదివి జర్నలిస్టుగా పనిచేసేవారు.

ఇలా జర్నలిస్టు(Journalist) గా పని చేస్తున్నటువంటి ఈయన కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం ఆయనని కలిశారు.

ఇలా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) మదిలో ఒక ఆలోచన తట్టింది అప్పటికే ఆయన చేయాల్సినటువంటి అంకుశం సినిమాలో విలన్ పాత్ర కోసం వెతుకుతూ ఉన్నారు.

ఈ వ్యక్తి అయితే కరెక్ట్ గా సరిపోతారన్న భావించినటువంటి కోడి రామకృష్ణ వెంటనే సినిమాలలో అవకాశమిస్తే నటిస్తావా అంటూ ఈయనని ప్రశ్నించారట.

"""/" / సినిమాలలో నేను నటించడం అసలు నటన అంటే ఏంటో కూడా నాకు తెలియదని రామిరెడ్డి చెప్పినప్పటికీ నేను నేర్పిస్తాను అంటూ అంకుశం సినిమాలో( Ankusham Movie ) విలన్ పాత్రకు ఒప్పించారట.

ఈ సినిమాతో ఎంతో మంచి పొందిన రామిరెడ్డి తెలుగు తమిళ భోజ్ పురి సినిమాలలో కూడా అవకాశాలను అందుకొని ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ విధంగా విరామం లేకుండా సినిమాలలో నటించడం వల్ల ఎంతో ఒత్తిడికి గురైనటువంటి ఈయన ప్రతిరోజూ మద్యం తాగుతూ ఆ ఒత్తిడి నుంచి బయటపడేవారట.

ఇలా తాగుడుకు బానిస కావటం వల్ల ఈయన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

"""/" / ఈ విధంగా లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని అయితే అది క్రమంగా క్యాన్సర్ కి కారణం కావడంతో అనారోగ్యానికి పాలై చివరి రోజులలో ఎంతో నరకం అనుభవించారు ఎంతో దృఢంగా ఆరడుగుల అజానుబావుడుగా ఉన్నటువంటి రామిరెడ్డి(Ramireddy) చివరి రోజుల్లో మాత్రం బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

ఇలా ఈయన చాలా బక్కగా మారిపోవడంతో ఈయనకు ఎయిడ్స్ వచ్చిందని అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు కూడా పుట్టించారు అయితే ఈయన కేవలం లివర్ క్యాన్సర్ (Liver Cancer) ద్వారానే మరణించారని సినిమాలలో నటిస్తూ ఎంతో గొప్పగా బతికినటువంటి రామిరెడ్డి సినిమాల కారణంగానే తాగుడుకు బానిసై చివరికి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.

బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?