ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ కు రెడీ..! 

ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ కు రెడీ.!  టీం ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్  ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లాండ్ జరిగిన ఒక వన్డేలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

బంతిని ఆపే క్రమంలో అతడు డ్రైవ్ చేస్తూ కింద పడ్డాడు దాంతో ఎడమ భుజానికి గాయమైంది.

ఆపై శస్త్ర చికిత్స చేయించుకో గా అప్పటినుంచి క్రికెట్ దూరం అయ్యాడు.ఈ క్రమంలోనే ఐపీఎల్ 14 సీజన్ లో ఆడలేకపోయాడు.

ఈ మధ్య  ఇటీవలే  పూర్తి ఫిట్ నెస్ తో వర్కౌట్ చేస్తోన్నాని తెలిపాడు.

భారత క్రికెట్ శ్రేయస్ అయ్యర్ పూర్తి మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకున్న ట్లు బెంగుళూరులోని భారత్ క్రికెట్ అకాడమీ (ఎన్.

సీ.ఏ) తెలిపింది.

అతను పూర్తి క్రికెట్ ఆడుకోవచ్చు అని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది.దీంతో వాయిదాపడిన ఐపీఎల్ సహా ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ నకు అతను అందుబాటులో ఉంటారు.

గాయం నుంచి కోలుకునేందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు యుద్ధానికి రెడీ నేను సిద్ధంగా ఉన్నాను ఇక రాబోయే కాలంలో బ్యాట్ మాట్లాడుతోంది అంటూ శ్రేయాస్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో అతని స్థానంలో టీమిండియా యువ కెరటం రిషబ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

వీడియో: పనిమనిషి సోఫాలో కూర్చుందంటూ ఎన్నారై మహిళ ఫిర్యాదు.. ఆమెపై నెటిజన్లు ఫైర్!