ఈ వీలునామా చదివితే హాస్యనటుడు రేలంగి ఎంత గొప్పవారో తెలుస్తుంది..
TeluguStop.com
రేలంగి మనవరాలు గాయత్రీ దేవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రేలంగి వెంకటరామయ్య ఎంత పెద్ద హాస్యనటులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వినవే బాల నా ప్రేమ గోల, సుందరి నీవంటి దివ్య స్వరూపము అంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన రేలంగికి హీరోలతో సమానంగా పాపులారిటీ ఉండేదంటే అతిశయోక్తి కాదు.
ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు కూడా లభించింది.
అత్యుత్తమ హాస్యనటుడిగా పేరొందిన రేలంగికి ఓకే ఒక కొడుకు ఉన్నారు.ఆ కుమారుడికి ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.
రేలంగికి తన మనవరాళ్లు అంటే ఎంతో ఇష్టమట.అందుకే ఆయన తన మనవరాళ్లను చాలా ప్రేమగా చూసుకునేవారని రేలంగి మనవరాలు గాయత్రీ దేవి చెప్పుకొచ్చారు.
1950-70 మధ్యకాలంలో హీరోలకి పోటాపోటీగా తమ తాతయ్య చలన చిత్ర పరిశ్రమలో కొనసాగారని ఆమె అన్నారు.
తన తాతయ్య దానధర్మాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని.ఒక విశ్వవిద్యాలయం నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారని ఆమె తెలిపారు.
అప్పట్లో నాలుగు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు.చదువుపై తనకున్న మక్కువతోనే రేలంగి ఆ స్థాయిలో విరాళాలు ఇచ్చేవారని గాయత్రీ దేవి అన్నారు.
1956లో వాహిని స్టూడియో పక్కనే ఉన్న విజయ గార్డెన్స్ ని తన తాతయ్య కొనుగోలు చేసి పంటలు పండించేవారని గాయత్రీదేవి చెప్పుకొచ్చారు.
అయితే ఈ స్థలానికి సంబంధించిన వీలునామా తనని ఆశ్చర్యపరిచిందని గాయత్రీదేవి అన్నారు.ఎందుకని అడిగితే.
ఆడ మగ తేడా లేకుండా ఆ స్థలాన్ని సమానంగా తన మనవళ్లందరికీ పంచిపెట్టాలని వీలునామాలో రాశారు.
ఆ స్థలాన్ని ఆడ మగ తేడా లేకుండా సరిసమానంగా అనుభవించేలాగా వీలునామా రాయడం తన దూరదృష్టికి మచ్చుతునక అని ఆమె అన్నారు.
తన తండ్రి చనిపోయేంతవరకు ఆ స్థలాన్ని మనవళ్లు ఎవరికీ విక్రయించడానికి వీలు లేదని తన తాతయ్య వీలునామాలో రాశారని.
ఆ వీలునామాని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె అన్నారు.'మాది రైతు కుటుంబం కాబట్టి స్థలాలు అమ్మకుండా.
డబ్బులు పాడు చేయకుండా ఉండేందుకు ఆ కాలంలోనే మా తాతయ్య ఎంతో బిగింపుగా వీలునామా రాసారు.
దీన్నిబట్టి ఆయన ఎంత గొప్పవారో అర్థమవుతుంది' అని ఆమె చెప్పుకొచ్చారు.
కొరియన్ భర్తకి పరీక్ష పెట్టిన ఇండియన్ భార్య.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..