ఆర్డిఓగా శ్రీనివాస్ సేవలు మరువలేనివి – కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల ఆర్డిఓ గా టి శ్రీనివాస రావు సేవలు మరువలేనివనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్డిఓ టి శ్రీనివాస రావు వీడ్కోలు సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ లో 5 సంవత్సరాలు ఆర్డిఓ గా టి శ్రీనివాస రావు సమర్థవంతంగా పనిచేశారన్నారు.

వారి నుంచి అనేక విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పారు.మధ్య మానేరు, అనంతగిరి ప్రాజెక్టు , ఆక్వా హబ్ ప్రాజెక్టు కు క్రిటికల్ భూసేకరణ చాకచక్యం గా పూర్తి చేశారని అన్నారు.

కోవిడ్ క్లిష్ట సమయంలో, సీరియల్ ఎన్నికలలో క్రీయాశీలకంగా పని చేశారని అన్నారు.మీ తో పనిచేసిన 2 సంవత్సరాలు తనకు సంతోషం ఇచ్చిందన్నారు.

ప్రభుత్వ ఉద్దేశం, ప్రాధాన్యతలు తెలుసుకొని పని చేసుకొని సొల్యూషన్ ఓరియంటెడ్ గా పని చేశారని అన్నారు.

అలాగే జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ పనిలో రోజువారీ విధులతో పాటు జనరల్ ఎన్నికల తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు విధులు సమర్థవంతంగా ఆర్డిఓ టి శ్రీనివాస రావు పని చేశారని అన్నారు.

ఎస్ డి సి గా అనంతగిరి ప్రాజెక్టు, రైల్వే భూసేకరణ లో టి శ్రీనివాస రావు కీలకంగా పని చేశారని అన్నారు.

స్టేట్ లో ఓకె ఒక్క డిప్యూటీ కలెక్టర్ స్థాయి శేరి లింగంపల్లి తహశీల్దార్ పోస్ట్ ఉందన్నారు.

దానిని వారికి ఇవ్వడం వారి పనితీరుకు నిదర్శనం అన్నారు.h3 Class=subheader-styleసన్మాన గ్రహీత ఆర్డిఓ టి శ్రీనివాస రావు మాట్లాడుతూ.

/h3p మీ అందరి సహకారం వల్లే నా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించగలిగానని అన్నారు.2018 సంవత్సరంలో ఈ జిల్లాకు ఆర్డిఓగా వచ్చిన సమయంలో భూసేకరణ ప్రక్రియ , ఎన్నికలు ఉన్నతాధికారుల మార్గదర్శనంలో సజావుగా విధులు నిర్వర్తించామన్నారు.

జిల్లా కలెక్టర్ ల ఆదేశాలతో ఎంఎంఆర్, అనంతగిరి ప్రాజెక్టు లో నీరు నింపే సమయంలో నిర్వాసితులను తరలించే ప్రక్రియ, ఆక్వా హబ్ భూ సేకరణ సజావుగా జరిగేలా చూసామన్నారు.

ఈ సందర్భంగా అధికారులు ఆర్డిఓ టి శ్రీనివాసరావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా అధికారులు, తహశీల్దార్ లు, కలెక్టరేట్ విభాగాల పర్యవేక్షకులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రజనీతో పోటీ అంటే సూర్య భయపడ్డారా.. వెనుకడుగు వేయడం వెనుక కారణాలివేనా?