భారీవర్షాల దృష్ట్యా మండల అధికారుల పర్యవేక్షణ, సహాయక చర్యలు లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఆర్డివో రమేష్.

రాజన్న సరిసిల్ల జిల్లా:రాష్ట్రములో కురుస్తున్న భారీ వర్షాల వలన ఇల్లంతకుంట మండలంలో అధికారులు సమస్యత్మాక గ్రామాలను మండల అధికారులతో పాటు సిరిసిల ఆర్డీవో రమేష్ మండలంలోని వల్లంపట్ల-కిస్టారావుపల్లె గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుపై వరద ఉధృతి ఎక్కువగా రావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఎవరు కూడా అటువైపు వెళ్లకూడదని,అక్కడ ఇల్లంతకుంట పోలీసు యంత్రాంగం భారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆ వైపుకు రాకుండా ఉండాలని సూచించారు అదే విదంగా .

కందికట్కూరు గ్రామంలో వరదల వలన లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలోకి వచ్చే వర్షపునీరును స్థానిక మండల అధికారులు సకాలంలో స్పందించి సహాయక చర్యలు తీసుకోవడం వలన ప్రమాదం తప్పిందని, స్థానిక అధికారులకు చెపుతూ,డ్రైనేజిలో చెత్త చెదారం పెరుకపోవడంతో నీరు ఇండ్లలోకి వస్తుందని, ఈరోజు అధికార యంత్రాంగం సకాలంలో చర్యలు తీసుకొని డ్రైనేజీ లోని వ్యర్టాలను జేసిబి సహాయంతో తొలగించడం, అదే విధంగా నర్సక్కపేట-జవారిపేట గ్రామాల మధ్య ఉన్నటువంటి బిక్కవాగుపై ఉన్నా కల్వర్టు పూర్తిగా తెగిపోయింది మండల పర్యటనలో భాగంగా అక్కడకి వచ్చిన ఆర్డీవో మాట్లాడుతూ, ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని,తీవ్ర వర్షాల వల్ల పూర్తిగా రోడ్డు ధ్వంసమై కొట్టుకపోవడం జరిగిందని దానివల్ల రవాణకు అంతరాయం ఏర్పడిందని తెలియజేశారు.

మండలంలోని పలు గ్రామాలు పర్యటన చేసి అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వర్ష ప్రభావం వలన ప్రజలు సిదిలావస్థలో వున్నా ఇండ్లు, మట్టి గోడలు, ఉన్నఇండ్లలో ఉండకూడదని అదేవిధంగా విద్యుత్ స్తంభాల దగ్గరగా ఉండకూడదని,వాటిని ముట్టుకోకుండా ఉండాలని అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా అవడం మూలంగా ప్రాణాలకే ప్రమాదామని తెలియజేశారు.

భారీ వర్షాల కారణంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సహాయ సహకారాల కొరకు ఈ క్రింది హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయగలరు 9985437929 తెలియజేశారు.

ఆయన వెంట మండల ఎంపీడీవో శశికళ,తహసిల్దార్ ఎం.ఎ.

ఫారూఖ్,డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ,ఆర్ఐ షఫీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఈవెంట్ కి ఎన్టీయార్ హాజరవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?