సుకుమార్ కొత్త సినిమాలో ఊరమాస్ రోల్ లో రామ్ చరణ్.. రంగస్థలంను మరిపిస్తారంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్( Director Sukumar, Ram Charan ) కాంబినేషన్లో గతంలో సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.ఆ సినిమా మరేదో కాదు రంగస్థలం.

ఈ సినిమాతో రాంచరణ్ క్రేజ్ ని స్థాయి మరింత పెరిగింది.ముఖ్యంగా రంగస్థలం సినిమాలో( Rangasthalam Movie ) మాస్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ లీలమైపోయి అదరగొట్టాడు.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ని సుకుమార్ ఏ విధంగా చూపించబోతున్నాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

"""/" / రంగస్థలం తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో RC17 ( RC17 )చిత్రానికి ఓకే చెప్పాడు రామ్‌చరణ్‌.

మధ్యలో ఆర్ఆర్ఆర్‌, గేమ్‌ ఛేంజర్‌ ( RRR, A Game Changer )చిత్రాలకు ఎక్కువ సమయం తీసుకున్న రామ్‌చరణ్‌ ఇక వేగంగా సినిమాలు తీయాలనే ఆలోచనతో వరుసగా కొత్త ప్రాజెక్టులకు కమిట్‌ అవుతున్నారు.

ఈ క్రమంలోనే త్వరలో బుచ్చిబాబు సెట్స్‌పై రాబోతుండగా, సుకుమార్‌ సినిమాకు కూడా అంతా రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ఛేంజర్ సినిమా ఫినిష్ చేశాడు.బుచ్చిబాబు( Buchi Babu ) డైరెక్షన్‌లో నెక్ట్స్‌ మూవీలో నటించనున్నాడు.

మరో వైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కూడా పుష్ప2 సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

ఇటు రాంచరణ్, అటు సుకుమార్ ఇద్దరూ తమ సినిమాలను డిసెంబర్‌ బరిలో ఉంచారు.

"""/" / ఇక ఈ ఇద్దరు కలసి RC 17 సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే.

దీని కోసం సుకుమార్ టీమ్, సీనియర్ రైటర్లు స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని చెబుతున్నారు.

ఇందులో రామ్‌చరణ్ పాత్ర ఊరమాస్‌గా ఉండబోతుందని టాక్.ఇప్పటికే రంగస్ధలం సినిమాలో చరణ్‌ను మాస్‌లుక్‌లో చూపించిన సుకుమార్‌ ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ ని ఊర మాస్ పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న నెక్ట్స్‌ మూవీ అంతకుమించి అన్నట్లు ఉండబోతోందని టాక్‌.

కొత్త లుక్‌లో రామ్ చరణ్ అందరిని భయపెట్టేస్తాడంటున్నారు.ఇక ఈ మూవీకి సంబంధించిన అన్ని డిటైల్స్ పుష్ప2 సినిమా కంప్లీట్ అవ్వగానే ఎనౌన్స్ చేస్తారట.

వీరందరూ పేరున్న సెలబ్రిటీలే.. కానీ తెర వెనుక నీచులు..??