‘RC15’ అప్డేట్.. అప్పుడు రాజకీయ నాయకుడిగా.. ఇప్పుడు స్టూడెంట్ గా..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా హిట్ తో చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.దీంతో ఆయన తర్వాత సినిమా షూటింగ్ కూడా అదే జోష్ లో చేస్తున్నాడు.

మొన్నటి వరకు చరణ్ ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో బిజీగా ఉండడంతో ఆయన తర్వాత సినిమాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది.

ఇక ఇప్పుడు చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.

ఈయన సినిమాలు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే ఈ సినిమా నుండి చరణ్ కొత్త లుక్ బయటకు వచ్చింది.

ఇందులో చరణ్ రాజకీయ నాయకుడిలా కనిపించాడు.ఈ పాత్రలో ఈయన పెద్దాయన లాగా కనిపిస్తుంది.

ఇక తాజాగా అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించ బోతున్నాడట.

ఇందులో రామ్ చరణ్ తో పాటు కియారా, నవీన్ చంద్ర, ప్రియదర్శి కూడా పాల్గొన్నారు.

"""/"/ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఈ షెడ్యూల్ ఏప్రిల్ మూడవ వారం వరకు చేసి ఆ తర్వాత ఆచార్య ప్రొమోషన్స్ ల బిజీగా మారనున్నాడు చరణ్.

ఈ లోపు ఈ షెడ్యూల్ పూర్తి చేయాలనీ శంకర్ వేగంగా షూట్ చేస్తున్నాడట.

ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం అని వార్తలు వచ్చాయి.ఇప్పుడు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

చరణ్ లుక్ ఇటీవలే బయటకు వచ్చింది.అందులో పెద్దాయన పాత్రలో ఉన్నాడు ఇక ఇప్పుడు స్టూడెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు.

దీంతో ఈ రెండు రెండు పాత్రలని తెలుస్తుంది.మెగా ఫ్యాన్స్ ఈ విషయం విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన బాలయ్య కాదు… ఎప్పుడు నాకు సారే … పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!