చరణ్ సుకుమార్ కొత్త మూవీలో హీరోయిన్ గా సమంత.. అదే జరిగితే ఇండస్ట్రీ షేకవుతుందా?

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆర్సీ 15 టైటిల్ ( RC 15 )తో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సుకుమార్ తో ప్లాన్ చేసుకున్న ఆర్సి 17 పనులు వేగవంతం చేశారు.ప్రస్తుతం క్యాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీమ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై తెగ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

అయితే ఇందులో ఆప్షన్ గా సమంత పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇదివరకు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే.

"""/" / చిట్టిబాబు, రామలక్ష్మి( Chittibabu, Ramalakshmi ) కెమిస్ట్రీని క్లాసు, మాస్ అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు.

ఆ మాటకొస్తే ఈ జంటను మరిపించే మేజిక్ మరో దర్శకుడు చరణ్ కు ఇవ్వలేదని చెప్పాలి.

అందుకే రామ్ చరణ్ సరసన సమంత అయితే ఎలా ఉంటుంది అనే కోణంలో సుకుమార్ ఆలోచిస్తున్నారట.

కాకపోతే సినిమాలు చేయడం తగ్గించేసిన సమంత బ్రాండ్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఏ మేరకు ఉపయోగపడుతుందనేది విశ్లేషించుకోవాలి.

పుష్పలో ఐటెం సాంగ్, సిటాడెల్ వెబ్ సిరీస్ ( Citadel Web Series )ద్వారా పాపులారిటీ విషయంలో సామ్ ముందంజలోనే ఉంది కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

"""/" / ఒకవేళ నిజంగా సుకుమార్ అడిగితే మాత్రం నో అనకపోవచ్చు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

అయితే మరో ఆప్షన్ గా రష్మిక మందనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.మరి ఈ విషయాలపై పూర్తి సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

మరోవైపు సుకుమార్ తన టీం తో కలిసి స్క్రిప్ట్ పనుల్లో భాగంగా బిజీగా ఉన్నారు.

ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనక అక్టోబర్ లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి ఆర్సి 17 సెట్స్ పైకి తీసుకెళ్లాలి.