రూపాయి బతకాలంటే...ఆర్‌బీఐ ఎన్నారై బాండ్స్...

రూపాయి విలువ డాలర్ తో పోల్చుకుంటే బలహీన పడుతోంది.ఈ నేపధ్యంలో రూపాయి బ్రతకడానికి ఆర్‌బీఐ నష్టనివారణ చర్యలని చేపడుతోంది.

అందులో భాగంగానే ఎన్నారై బాండ్స్ ని విడుదల చేయడానికి సిద్దమయ్యింది.అందుకు గాను ఎన్‌ఆర్‌ఐ బాండ్స్‌ను విడుదల చేయడం ద్వారా 30-35 బిలియన్‌ డాలర్లను సమీకరించే ఆలోచనలో ఉందని ఓ నివేదిక తెలిపింది.

ఎంఎస్‌సీఐలో నమోదైన చైనా కంపెలకువిదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) వచ్చి చేరుతుండటంతో అవి భారత్‌పై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే 2019 నాటికి చైనా మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని, బీవోఎఫ్‌ఏఎంఎల్‌ ఓ నివేదిక పేర్కొంది.

దాంతో ‘చైనాపై మా వ్యూహ నిపుణుల అంచనాల ప్రకారం 2019 చివరినాటికి ఆ దేశ సూచీలు 100 బిలియన్‌ డాలర్లకు చేరుతాయని “బీవోఎఫ్‌ఏఎంఎల్‌” తన పరిశోధనలో తెలిపింది.

దీంతో భారత్‌లో ఎఫ్‌పీఐల రాక నెమ్మదిస్తుందని ఇందుకు రాజకీయ అనిశ్చితి, వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలు ఇవన్నీ విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని తెలిపింది.

ఇదిలాఉంటే ‘చైనాకు భారీగా ఎఫ్‌పీఐలు వెళ్లడం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా భారత్‌కు ఎఫ్‌పీఐల ప్రవాహం తగ్గిపోతోంది.

దాంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నఆర్‌బీఐ 30-35 బిలియన్‌ డాలర్లను ఎన్‌ఆర్‌ఐ బాండ్స్‌ ద్వారా సమీకరించే అవకాశం ఉందని తెలిపింది.

ఎన్‌ఆర్‌ఐ బాండ్స్‌ ప్రవాసులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది వీటికి 3 నుంచీ 5 ఏళ్ల కాల పరిమితిని పెట్టాలని నిర్దేశించింది అయితే ఈలోగా ఈ బాండ్ లని తెసుకోవడానికి వీలు ఉండదు అని తెలిపింది.

విరాట్ కోహ్లీని టీజ్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్.. ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ (వీడియో)