రుణ వ‌సూళ్ల ఏజెంట్లకు ఆర్బీఐ కీల‌క ఆదేశాలు

రుణాల‌ను వ‌సూలు చేసే ఏజెంట్ల‌కు ఆర్బీఐ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.దీనిలో భాగంగా ఏజెంట్లు భౌతికంగా కానీ, మాట‌ల రూపంలో కానీ వేధింపుల‌కు పాల్ప‌డ‌కుండా ఆర్ఈలు చ‌ర్య‌లు తీసుకోవాలంది.

ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంప‌కూడద‌ని, గుర్తు తెలియ‌ని కాల్స్ రూపంలో వేధించ‌కూడ‌ద‌ని పేర్కొంది.

అదేవిధంగా, రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల మ‌ధ్య రుణం కోసం కాల్ చేయ‌డాన్ని నిషేధించింది.

త‌న నియంత్ర‌ణ‌లోని బ్యాంకులు, ఆర్ఈలకు సంబంధించి అద‌న‌పు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.రిక‌వ‌రీ ఏజెంట్లు ఇటీవ‌లి కాలంలో ఆమోద‌నీయం కానీ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలియ‌డంతో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.

మంగళగిరిలో టీడీపీ రౌడీ రాజకీయం..!!