బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది… ఇకనుండి ఆ సర్వీసులు షురూ!
TeluguStop.com
అవును, బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ( RBI ) చల్లని కబురు అందించింది.కస్టమర్ల కోసం కొత్త సర్వీసులు తీసుకువస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఈ క్రమంలో అన్ని బ్యాంకుల కస్టమర్ల కోసం ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
దీంతో బ్యాంక్ ఖాతాదారులకు ఎంతోకొంత ఊరట చేకూరనుంది.పదేళ్లు దాటినా కూడా అకౌంట్ల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయకుండా వున్న అన్‌క్లెయిమ్ డిపాజిట్ల వివరాలను సులభంగా ఈ కొత్త వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆర్‌బీఐ తాజాగా వివరించింది.
"""/" /
అవును, ప్రస్తుతం బ్యాంక్ కస్టమర్లు సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి అన్‌క్లెయిమ్ డిపాజిట్ల( Unclaimed Deposits ) గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
అయితే కొత్తగా తీసుకువచ్చే వెబ్‌సైట్‌లోకి అన్ని బ్యాంకుల అన్‌క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు ఒకే చోటు మనకి కనబడడం గమనార్హం.
బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తాజా ప్రకటనలో వెల్లడించింది.
బ్యాంక్‌లో పదేళ్లు మించి ఉన్న డిపాజిట్లను ఆర్‌బీఐకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.అంటే పదేళ్లకు దాటినా కూడా ఎవ్వరూ ఆ డబ్బులను విత్‌డ్రా చేసుకోకపోతే.
ఆ డబ్బులు ఆర్‌బీఐకు చేరుతాయన్నమాట. """/" /
ఆ తరువాత అవి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో( Depositor Education And Awareness Fund ) జమ అవుతాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ అయిపోయినా విత్‌డ్రా చేసుకోకపోవడం, బ్యాంక్ ఖాతాదారులు మరణించినప్పుడు నామినీ ఆ అకౌంట్లలోని డబ్బులను తీసుకోకపోవడం వంటి పలు అంశాల నేపథ్యంలో ఈ అన్‌క్లెయిమ్ డిపాజిట్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
ఆర్‌బీఐ ప్రకారం చూస్తే.ఫిబ్రవరి 2023 చివరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్‌బీఐకి అన్‌క్లెయిమ్ డిపాజిట్ల రూపంలో రూ.
35,012 కోట్లను బదిలీ చేశాయి.అంటే ఏ స్థాయిలో డబ్బులు బ్యాంకుల్లో మిగిలిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
ఎస్‌బీఐలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.8086 కోట్లుగా ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.5340 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ.
4558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3904 కోట్లు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters