కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే చెయ్యి వేసిన తండ్రి...
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో కొందరు కామ వాంఛలతో రగిలిపోతూ వావివరుసలు మరచి ప్రవర్తిస్తునారు.తాజాగా తన పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కామాంధుడిగా మారిన తన కూతురి పై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని రాయవరం మండలానికి చెందినటువంటి ఓ గ్రామంలో ఓ వ్యక్తి తన కూతురుతో కలిసి నివసిస్తున్నాడు.
అయితే అతడి కూతురు హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది.అయితే ఈ వ్యక్తి భర్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది.
దీంతో అప్పటి నుంచి కామవాంఛలతో రగిలి పోయే వాడు.అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఇతడి కూతురు సంక్రాంతి పండుగ నిమిత్తమై ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో తన రక్తం పంచుకు పుట్టిన కన్నకూతురు అని కూడా చూడకుండా ఆమెతో తన కామ వాంఛను తీర్చుకున్నాడు.
అంతేగాక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోయేది.
అయితే తాజాగా మరోసారి ఆ బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతూ ఉండగా ఆ బాలిక ప్రతిఘటించి పక్కనే ఉన్నటువంటి మరో ఇంట్లోకి వెళ్లిపోయింది.
"""/"/తన తండ్రి చేసేటువంటి పైశాచిక పనులకు తీవ్ర భయాందోళనకు గురైన ఆ బాలిక భయపడుతూ తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి పొరుగింటి వారికి తెలియజేసింది.
దాంతో వారు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు నిందితుడు అయినటువంటి ఆ బాలిక తండ్రి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని నిందితుడిని విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.
వీడియో: బిర్యానీలో ఐస్‌క్రీమా.. ఈ ఫుడ్ కాంబినేషన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!