ఆది నుంచి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తోంది..బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.ఈ నేపథ్యంలో తాగునీటి కోసం ఈ నెల 28 నిర్వహించే చలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని సీమ వాసులంతా జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రాయలసీమ పోరాట సమితి వాదులతో కలిసి మీడియాతో మాట్లాడారు.అధికారంలో కొచ్చే పాలకులు, కల్లబొల్లి మాటలతో రాయలసీమకు అన్యాయం చేస్తూనే వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బళ్ళారి జిల్లా కోల్పోయామనీ,నిధులు, నియామకాలు, నీళ్లు కోల్పోతున్నామనీ ఆవేద వ్యక్తం చేశారు బైరెడ్డి.

నీటి కేటాయింపుల్లో సీమకు అన్యాయం జరుగుతుండటంతో,రాయలసీమ భూములు బీడు భూములుగా మారుతున్నాయన్నారు.తిరుమలకొచ్చే భక్తుల అవసరాలకు సరిపడా నీళ్ళు రావడం లేదనీ,చెప్పిన రాజశేఖర్ రెడ్డి, 600 టి.

ఏం.సి నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తోందన్నారు.

రాయలసీమలో 10 టి.ఎం.

సి కెపాసిటీ ప్రాజెక్ట్లు కూడా లేవన్నారు.15 టి.

ఎం.సి లు నీళ్ళు చెన్నైకు పోతున్నాయని, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రెండు టీ.

ఎం.సి ల వాటర్ అందడం లేదన్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్కు రక్షణ లేదనీ, భారీ వర్షాలు కురిస్తే ఏదో ఒకరోజు కూలుతుందనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంగమేశ్వరం లేదా సిద్దేశ్వరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి అవసరం లేదన్న బైరెడ్డి బ్రిడ్జి కమ్ బ్యారేజి నిర్మాణం డిమాండ్తో జనవరి 28 నుంచి ప్రజా ప్రదర్శన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.

ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, రాయలసీమకు నీటినందించాలని విజ్ఞప్తి చేశారు.కాలయాపన చేస్తే రాయలసీమ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఈ ప్రోటీన్ మాస్క్ తో మీ కురులు అవుతాయి డబుల్..!