Rayalaseema Politics : సీమలోని ఆ జిల్లాలలో కూటమికి భారీ షాక్ తప్పదా.. వైసీపీకే విజయావకాశాలు ఉన్నాయా?
TeluguStop.com
2024 ఏపీ ఎన్నికలు( AP 2024 Elections ) మే నెల 13వ తేదీన జరగనున్నాయి.
సాధారణంగా ఏపీ ఎన్నికలు తొలి విడతలో జరుగుతాయని అందరూ భావించగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ ఎన్నికలకు రెండు నెలల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.
అటు టీడీపీ ( TDP ) నేతలు కానీ ఇటు వైసీపీ( YCP ) నేతలు కానీ ఇప్పటివరకు ప్రచారం మొదలుపెట్టలేదు.
ఈరోజు లేదా ఈ వారం నుంచి ప్రచారం మొదలుపెట్టేలా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రణాళిక ఉంది.
కొన్ని జిల్లాలలో వైసీపీ బలంగా ఉండగా మరికొన్ని జిల్లాలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి( TDP BJP Janasena Alliance ) బలంగా ఉంది.
అయితే ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాలలో మాత్రం వైసీపీ హవా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ అనుకూల సర్వేలలో సైతం ఈ జిల్లాలలో మెజారిటీ స్థానాలు వైసీపీ సొంతం చేసుకుంటోంది.
2019 ఎన్నికల్లో ఈ జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ ఈ జిల్లాల్లో అదే మ్యాజిక్ రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"""/" /
ఉమ్మడి కర్నూలు జిల్లాలో( Kurnool District ) 14 నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లాలో( Kadapa District ) 10 నియోజకవర్గాలు ఉండగా 24 నియోజకవర్గాలలో 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.
ఈ జిల్లాలలో ఇప్పటికీ వైసీపీ బలంగా ఉంది.వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొంతమేర కష్టపడినా ఈ ఎన్నికల్లో సులువుగానే విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంది.
2014 ఎన్నికల్లో సైతం ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి.
"""/" /
సీఎం జగన్( CM Jagan ) 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలలో ఎవరెవరు పోటీ చేస్తారో ప్రకటించగా త్వరలో మేనిఫెస్టో కూడా ప్రకటించనున్నారు.
టీడీపీని ఇచ్చిన హామీలను మించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే హామీలతో వైసీపీ అడుగులు వేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో 50కు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ అనేలా పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఏ రాజకీయ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.
చిరంజీవిని అనిల్ అలా చూపించనున్నారా.. ఆ సినిమాను మించిన హిట్ గ్యారంటీ!