మాస్ రాజా రిస్క్.. అన్నిటిని అధిగమించి ‘టైగర్’ ఎటాక్ ఎలా ఉండబోతుంది?

దసరా సీజన్ లో కూడా మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు బరిలోకి దిగుతారు.

బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో దండయాత్ర చేయడానికి ఊహించని విధంగా మూడు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధం అవుతున్నాయి.

ఇద్దరు టాలీవుడ్ హీరోలు కాగా ఒకరు కోలీవుడ్ హీరో.నందమూరి బాలకృష్ణ, మాస్ రాజా రవితేజ పోటీకి సై అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా వీరి మధ్యలో పోటీ పడనున్నారు.

అయితే ఈ ముగ్గురిలో మాస్ రాజా రాంగ్ టైం లో వచ్చి రిస్క్ చేస్తున్నాడా ? ఇంత పోటీ మధ్య ఈయన రాక ఎంత వరకు కరెక్ట్.

టైగర్ నాగేశ్వరరావు సినిమాపై మిగిలిన సినిమాల ప్రభావం పడేలానే ఉంది.ఎందుకంటే బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ''భగవంత్ కేసరి'( Bhagavanth Kesari, )' కేవలం తెలుగులోనే రిలీజ్ కాబోతుంది.

కానీ రవితేజ టైగర్ పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.బాలయ్య అక్టోబర్ 19న రాబోతుంటే అదే రోజు విజయ్ లియో కూడా రిలీజ్ కాబోతుంది.

లియో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కావడంతో టైగర్ కంటే భారీ క్రేజ్ తో ముందంజలో ఉంది.

టైగర్ అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది( Tiger Nageswararao ).కానీ ఈ సినిమాకు తెలుగులో మినహా ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో థియేటర్స్ లభించలేదు.

ఎప్పుడు లేనిది రవితేజ ముంబై వెళ్లి కూడా ప్రమోషన్స్ చేసారు. """/" / కానీ రిలీజ్ డేట్ విషయంలో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది.

ఎందుకంటే ఈ సినిమాకు తెలుగులో మినహా తమిళ్, హిందీలో అసలు ఆశించిన థియేటర్స్ లభించలేదు.

అలాగే మలయాళ, కన్నడ భాషల్లో కూడా లియో మ్యానియా కనిపిస్తుంది.హిందీలో టైగర్ ష్రాఫ్ గణపత్ రిలీజ్ అవుతుండడంతో అక్కడ అనుకున్న స్థాయిలో థియేటర్స్ లభించలేదు.

"""/" / తమిళ్ లో అయితే అసలు టైగర్ కు డిస్టిబ్యూటర్స్ సపోర్ట్ ఏమాత్రం లేదట.

లియో( Leo ) రానుండడంతో మాస్ రాజాకు థియేటర్స్ దొరకలేదని టాక్.మన దగ్గర మాత్రమే మంచి హైప్ ఉన్న టైగర్ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ పోటీ మధ్య కొద్దిగా థియేటర్స్ లభించిన రిలీజ్ చేస్తే కలెక్షన్స్ విషయంలో కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మరి మేకర్స్ ఏం చేయనున్నారో.ఈ పోటీ మధ్య టైగర్ ఎటాక్ ఎలా ఉంటుందో చూడాలి.

సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబో లో సినిమా రాబోతుందా..? బ్యాక్ డ్రాప్ ఏంటంటే..?