ఆ సినిమా కోసం పది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న రవితేజ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రవితేజ ( Raviteja ) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రవితేజ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇక త్వరలోనే ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
"""/" /
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రవితేజకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదని చెప్పాలి ఇండస్ట్రీలోకి వచ్చి మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.
అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో హీరోలకు స్నేహితుడు గాను తమ్ముడి పాత్రలలోనూ నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే సమయంలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ ( Remuneration ) ఇచ్చేవారట.
"""/" /
రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి సమయంలో భోజనం పెట్టి ప్రొడక్షన్ వారు రోజుకు పది రూపాయలు( Ten Rupees ) మాత్రమే ఇచ్చేవారని తెలుస్తోంది.
రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడు( Allari Priyudu ) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమా కోసం ఈయన రోజుకు పది రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నారని, ఇలా పది రూపాయలతో మొదలైన తన రెమ్యూనరేషన్ నేడు 30 కోట్ల వరకు వెళ్లిందని చెప్పాలి.
ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ అందుకోవడం అంటే ఇదే అసలు సిసలైన సక్సెస్ అంటూ పలువురు రవితేజ విజయం పై కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలోనే ఈగల్ సినిమా ద్వారా రాబోతున్నటువంటి రవితేజకు ఈ సినిమా ఇలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
మెగా సంక్రాంతి సంబరాలకు అల్లు అర్జున్ వస్తారా… పోలీసులు అనుమతి ఇస్తారా?