ధమాకా బడ్జెట్‌ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

రవితేజ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా పాతిక కోట్ల రూపాయలుగా సమాచారం అందుతుంది.

రవితేజ ఈ మధ్య కాలంలో వరుసగా తన సినిమాలతో నిరాశ పరచుతూ ఉన్నాడు.

అయినా కూడా ఈ సినిమా కు పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం అనేది రిస్క్ అయినప్పటికీ చిత్రం పై ఉన్న నమ్మకం తో ఇంత ఖర్చు చేశారు అంటూ సమాచారం అందుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా 20 కోట్ల థియేట్రికల్‌ రైట్స్‌ ను మరియు 15 కోట్ల నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ బిజినెస్ చేసిందట.

అంటే సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు లాభం దక్కింది. """/"/ సినిమా విడుదల అయ్యాక మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా పాతిక నుండి 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది.

కనుక ధమాకా సినిమా తో రవితేజ భారీ లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా మాస్ ఆడియోస్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ రవితేజ ప్రమోషనల్ కార్యక్రమాలు తెగ చెబుతున్నాడు.

గతం లో రవితేజ ఎప్పుడూ కూడా ఈ స్థాయి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించ లేదు.

కానీ ఈసారి కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రమోషనల్ ఈవెంట్స్ మరియు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

రవితేజ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మరియు ప్రమోషనల్ ఈవెంట్స్ కారణంగా ధమాకా సినిమా కు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఖచ్చితంగా పెట్టుబడికి న్యాయం చేసే విధంగా ఉంటుంది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఖలిస్తాన్ ఉద్యమం : భారత సమగ్రతను గౌరవించాల్సిందే.. కెనడా మంత్రి సంచలన వ్యాఖ్యలు