ఆ ఐరన్ లెగ్ హీరోయిన్ కు మరో ఛాన్స్ ఇస్తున్న రవితేజ.. మూడు ఫ్లాపులిచ్చిన హీరోయిన్ కావాలంటూ?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జోడీలలో రవితేజ ,ఇలియానా( Ravi Teja, Ileana ) జోడీ కూడా ఒకటి.

ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కగా కిక్ మినహా మిగతా మూడు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి.

అయితే రవితేజ ఇలియనాకు మరో ఛాన్స్ ఇవ్వనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

ఈ విషయం తెలిసిన నెటిజన్లు రవితేజ మూడు ఫ్లాపులిచ్చిన హీరోయిన్ కావాలంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు.ఆ ఐరన్ లెగ్ హీరోయిన్ కు రవితేజ మరో ఛాన్స్ ఇస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాలి. """/" / మాస్ మహారాజ్ రవితేజ పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

రవితేజ గోపీచంద్ మలినేని కాంబో మూవీ ఆగిపోయిందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రవితేజ సంక్రాంతి కానుకగా ఈగిల్ సినిమాను విడుదల చేస్తున్నారు.ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా రవితేజ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

"""/" / రవితేజకు ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు.

రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజ ఫ్యాన్స్ ను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.తర్వాత సినిమాలతో రవితేజ రేంజ్ మరింత పెరుగుతుందేమో చూడాలి.

రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.2024 సంవత్సరం రవితేజకు కెరీర్ పరంగా మరింత కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని రవితేజ ఫీలవుతున్నారని తెలుస్తోంది.

రేణు దేశాయ్ ఇంట్లో ప్రత్యేక పూజలు… సంతోషం వ్యక్తం చేసిన నటి!