రవితేజ సత్తా చాటుతున్నాడు.. రెండు ఫ్లాప్స్ పడ్డా కూడా ఆ విషయంలో తగ్గలేదు

మాస్ మహారాజా రవితేజ నటించిన గత చిత్రాలు ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే.

ఆ రెండు సినిమాలు కూడా రవితేజ కెరియర్ పై చాలా ప్రభావం చూపిస్తాయని అంతా భావించారు.

కానీ ఆయన తదుపరి సినిమా ధమాకా కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తూ ఉంటే రవితేజ స్టార్ డం ఏ మాత్రం తగ్గలేదని.

రెండు సినిమాలు ఫెయిల్ అయినంత మాత్రాన ఆయన హీరోయిజం ఏమాత్రం తగ్గదు అని మరో సారి క్లారిటీ వచ్చేసింది.

వరుసగా రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన కూడా ఆయనను అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉంటారని నిరూపితం అయింది.

"""/"/ రవితేజ నటించిన ధమాకా సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అనే నమ్మకం తో ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారు.

సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా కోట్ల రూపాయల్లో కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ సినిమా కోసం రెండు విభిన్నమైన పాత్ర లో రవితేజ నటించిన పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమా లో హీరోయిన్ గా నటించడం తో అంచనాలు మరింతగా పెరిగాయి.

తాజాగా ట్రైలర్ విడుదల తో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది అంటూ చిత్ర యూనిట్ సభ్యుల నుండి టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి ధమాకా సినిమా కచ్చితంగా భారీ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది అని రవితేజ కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ గా ఉంటుందంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

రెండు ఫ్లాప్‌ లు పడిన తర్వాత కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కేవలం రవితేజ కు మాత్రమే చెల్లిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.