మాస్ రాజా దూకుడు అస్సలు తగ్గడం లేదుగా.. కుమ్మేస్తున్న 'ధమాకా' వసూళ్లు!

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'.

ఈ సినిమా మొన్న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.రవితేజ క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత రెండు భారీ డిజాస్టర్స్ ఎదుర్కున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ డిజాస్టర్స్ కు బదులు తీర్చుకునే సమయం వచ్చింది.అందుకే భారీ డిజాస్టర్స్ ను మరిపించే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మాస్ రాజా.

ధమాకా డిసెంబర్ 23న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ అందుకున్నాడు.

మాస్ రాజా ఈసారి మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.

ఓవర్సీస్ తో పాటు ఇక్కడ కూడా 6 రోజుల్లోనే మంచి వసూళ్లు రాబట్టింది.

19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగాడు రవితేజ.ధమాకా మొదటి రోజునే సాలిడ్ వసూళ్లు రాబట్టింది.

మాస్ రాజా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. """/"/ ఏకంగా 10 కోట్ల గ్రాస్ రాబట్టి ఆ రోజే సంచలనం క్రియేట్ చేసింది.

ఇక రిలీజ్ అయ్యి 6 రోజులు అవుతున్న వీక్ డేస్ లో కూడా అలాంటి కలెక్షన్స్ రాబడుతూ దుమ్ములేపేస్తుంది.

ఇక తాజాగా ఈ సినిమా 6 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టింది అని మేకర్స్ అఫిషియల్ పోస్టర్ తో అనౌన్స్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.

ఐదు రోజుల్లో ఈ సినిమా 49 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.ఇక తాజాగా ఈ సినిమా 6 రోజుల్లో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా మొత్తంగా 56 కోట్లు వసూళ్లు రాబట్టి కుమ్మేస్తుంది.దీంతో 50 కోట్లు క్రాస్ చేసిన మరొక సినిమా మాస్ రాజా ఖాతాలో పడింది.

మరి ఈ వసూళ్లు ఎక్కడ ఆగుతాయో చూడాలి.

సీరియల్స్ సంపాదన చీరలకే సరిపోతుంది.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!