మెగాస్టార్ కి బై బై చెప్పేసిన రవితేజ... ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరన్న సినిమా లో రవితేజ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే.
చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.పది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కోసం రవితేజ వైజాగ్ వెళ్ళాడు.
అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని నేడు ఉదయం హైదరాబాద్ కి చేరుకున్నారు.దీంతో వాల్తేరు వీరన్న సినిమా కోసం రవితేజ ఇచ్చిన డేట్స్ పూర్తయ్యాయి.
అలాగే తన యొక్క పాత్ర కూడా పూర్తి అయింది చిత్రీకరణకు రవితేజ గుడ్ బై చెప్పేసి హైదరాబాద్ చేరుకున్నాడు.
అతి త్వరలోనే తన సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.చిరంజీవి పై అభిమానం తో వాల్తేరు వీరన్న సినిమా లో కీలక పాత్ర లో నటించేందుకు ఒప్పుకున్న రవితేజ తన వంతు బాధ్యత ను నెరవేర్చారు.
వైజాగ్ షెడ్యూల్లో మొదట చిరంజీవి మరియు రవితేజ కలిసి పాల్గొన్నారు, తన వంతు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత చిరంజీవి అనంతపురం గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిపోయారు.
"""/" /
అక్కడి నుండి హైదరాబాద్ కు తరలి వచ్చారు.కానీ రవితేజ మాత్రం తన యొక్క పార్ట్ సోలో సన్నివేశాలని ముగించుకొని ఆ తర్వాత అంటే నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
చిరంజీవి మరియు రవితేజ గతంలో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు కానీ అప్పుడు రవితేజ ఒక స్టార్ హీరో కాదు, కానీ ఇప్పుడు రవితేజ ఒక స్టార్.
కనుక చిరంజీవి సినిమా లో ఆయన నటించడం వల్ల మల్టీ స్టారర్ సినిమా అయింది అనడంలో సందేహం లేదు.
మరి ఈ మల్టీ స్టార్ వాల్తేరు వీరన్న సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుంది అనేది అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.
ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ముందు ముందు రవితేజ మరిన్ని మల్టీ స్టార్ సినిమాలు చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ.. రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!