షూటింగ్ మొదటిరోజే ప్రీ లుక్.. రవితేజ దూకుడు బాగుంది..!

క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఖిలాడిగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత శరత్ మండవ డైరక్షన్ లో రవితేజ సినిమా చేస్తున్నారు.

రవితేజ కెరియర్ లో 68వ సినిమాగా ఈ మూవీ వస్తుంది.ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది.

సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈరోజే సినిమాకు సంబందించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ మాస్ రాజా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు.

థ్రిల్లర్ కథాంశంగా వస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ లుక్ కూడా అదిరిపోతుందని అంటున్నారు.

ప్రీ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన రవితేజ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

ఈ సినిమా తర్వాత రవితేజ నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా చేస్తారని తెలుస్తుంది.

  ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలో వస్తుందని తెలుస్తుంది.

నాగార్జున కుబేర ఫస్ట్ లుక్ లో ఆ ఒక్కటి మిస్ అయింది…